Thursday, May 23, 2024
- Advertisement -

టీమిండియా కోచ్ రేసులో శ్రీలంక మాజీఆట‌గాడు….?

- Advertisement -

ప్ర‌పంచ‌క‌ప్ వైఫ‌ల్యంతో కొత్త కోచ్ వేట‌లో ప‌డింది బీసీసీఐ. ఇప్ప‌టికే కోచ్‌, ఇత‌ర స‌హాక సిబ్బంది నియామ‌కానికి ద‌ర‌ఖాస్తుల‌ను కూడా ఆహ్వానించింది. ప్ర‌స్తుత కోచ్ ర‌విశాస్త్రి ప‌ద‌వీ కాలం ముగిసింది. కాని విండీస్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ప‌ద‌వీకాలం పొడిగించింది. అయితే ఈ సారి కోచ్ విష‌యంలో ఖ‌ఠిన‌మైన నిబంధ‌న‌లు విధించింది. కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తికి అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవంతో పాటు, 60 సంవత్సరాలు దాటకూడదని రూల్స్ లో పేర్కొన్నారు.

ప్ర‌పంచంలో అత్యంత ధ‌నిక క్రికెట్ బోర్డు ఏదంటె బీసీసీఐనే. దీంతో కలిసి పనిచేయడం అంటే మాజీ క్రికెటర్లను ఊరించే అంశమే. ఎందుకంటే, భారీ ప్యాకేజీతో పాటు అన్ని సౌకర్యాలు దక్కుతాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వెటరన్ ఆటగాళ్లు కోచ్ పదవి కోసం పోటీపడుతున్నారు. ఈ కోచ్ పదవి కోసం అటు స్వదేశీ క్రికెటర్లతో పాటు, విదేశీ కోచ్ లు కూడా క్యూ కడుతున్నారు.

ప్ర‌ధానం కోచ్ రేసులో శ్రీల‌కం మాజీ ఆట‌గాడు మ‌హేళ జ‌ర‌వ‌ర్ధ‌నె పేరు బ‌లంగా వినిపిస్తోంది. త్వరలోనే అతడు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు జయవర్థనేతో పాటు టీమిండియా మాజీ కోచ్‌ గ్యారీ కిరెస్టన్‌తో పాటు టామ్‌ మూడీ, వీరేంద్ర సెహ్వాగ్‌లు ఆసక్తిగా ఉన్నారు.

కోచ్ అన్వేషణ బాధ్యతను ఈ సారి కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంత రంగ స్వామి నేతృత్వంలోని కమిటీకి అప్పగించారు. ఇప్పటికే ముంబై ఇండియన్స్ కోచ్ గా ఇప్పటికే మహేలా జయవర్ధనే ఆ జట్టును 2 సార్లు విజేతగా నిలబెట్టాడు. కొన్నాళ్ల పాటు ఇంగ్లాండ్ కోచ్ గా సైతం మహేళా ఉండటం విశేషం. అలాగే ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్, ప్రస్తుత టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు జయవర్ధనేకు మధ్య సన్నిహిత సంబంధాలు క‌ల‌సి వ‌చ్చే అంశం. రోహిత్‌కూడా మ‌హేళ వైపే ఆస‌క్తి చూపుతున్న‌ట్లు స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -