Sunday, May 5, 2024
- Advertisement -

బ్రిస్బెన్ టీ 20లో పోరాడి ఓడిన భార‌త్‌…

- Advertisement -

బ్రిస్బేన్‌లోని గబ్బా ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో ఆసిస్‌పై భార‌త్ పోరాడి 4 ప‌రుగుల తేడాతో ఓట‌మిని చ‌విచూసింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోహ్లి సేన.. నిర్ణీత 17 ఓవర్లలో 7 వికెట్లకు 169 పరుగులు మాత్రమే చేయగలిగింది. 4 పరుగులతో గెలిచిన ఆస్ట్రేలియా 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యం సంపాదించింది.

ఓపెనర్ శిఖర్ ధావన్ (42 బంతుల్లో 76), చివర్లో దినేష్ కార్తీక్ (13 బంతుల్లో 30) పోరాడినా టీమ్‌కు ఓటమి తప్పలేదు. చివరి ఓవర్లో 13 పరుగులు చేయాల్సి ఉండగా.. కృనాల్ పాండ్యా, దినేష్ కార్తీక్ వరుస బంతుల్లో పెవిలియన్ చేరడం టీమ్ విజయావకాశాలను దెబ్బ తీసింది.

అంత‌కుముందు టీమిండియాకు 174 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ఆస్ట్రేలియా. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదించారు. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లకు 158 పరుగులు చేసింది. అయితే డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం లక్ష్యాన్ని 174 పరుగులకు సవరించారు. మ్యాక్స్‌వెల్ 24 బంతుల్లో 46 పరుగులు చేశాడు. అందులో నాలుగు సిక్సర్లు ఉన్నాయి. స్టాయినిస్ 19 బంతుల్లో 33 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. లిన్, (37), ఫించ్ (27) రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు, జస్‌ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ (7), విరాట్ కోహ్లి (4) దారుణంగా విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జంపా, స్టాయినిస్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -