ఐపీఎల్ 11 ఆటగాళ్ల వేలంపాటు ముగిసింది. తాజాగా ఐపీఎల్‌పై న్యూజిలాండ్ క్రికెటర్ల అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐపీఎల్ వేలంతో క్రికెటర్లను సంతలో పశువుల్లా మార్చారని అసోసియేషన్ అధ్యక్షుడు హీత్ మిల్స్ మండిపడ్డారు. స్థానిక హెరాల్డ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలోఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఐపీఎల్ వేలం పద్దతి ఆటగాళ్లందరినీ ఘోరంగా అవమానపరిచిందన్నారు. ప్రపంచం ముందు సంతలో పశువుల్లా నిలబెట్టింది. ఐపీఎల్ వల్ల చాలా లాభాలున్నాయి. కానీ వేలం నిర్వహించే పద్దతి ఇది కాదు. అనైతిక చర్య’ అని మిల్స్ అభిప్రాయపడ్డారు.
వేలం వల్ల ఏ జట్టుకు ఆడుతామో తెలియదని, యజమాని, కెప్టెన్ ఎవరో కూడా తెలియదని, కోచ్‌లతో సత్సంబంధాలు కూడా ఉండవని ఇది క్రికెట్‌కు మంచిది కాదని ఈ న్యూజిలాండ్ క్రికెటర్ చెప్పుకొచ్చారు. 10 ఏళ్లలో కొంతమంది ప్లేయర్లు అయితే ఏకంగా ఐదు, ఆరు జట్లకు ఆడటం చూశామని, ఇలా ఏ క్రీడాలీగ్‌లో జరగదని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లు ఈ పద్దతి మారేలా చూడాలని కోరారు.
ఐపీఎల్‌తో ఫిక్సింగ్, బెట్టింగ్‌లు బాగా ప్రాచుర్యం పొందాయని, మరి ఈ లీగ్‌తో క్రికెట్ ఆటకు ఒరిగిన ప్రయోజనమెంటో చూడాలని బాంబే హైకోర్టు కూడా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
