Thursday, May 2, 2024
- Advertisement -

తొలి టెస్ట్ : పంత్ ఔట్…..షాహూ ఇన్

- Advertisement -

యువ వికెట్ కీపర్ పంత్ కు బిగ్ షాక్ తగిలింది.గత కొంత కాలంగా తీవ్రంగా నిరాశ పరుస్తున్న పంత్ ను పక్కన పెట్టేశారు టీమ్ మేనేజ్ మెంట్. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో తలపడే భారత జట్టును బీసీసీఐ ఇవాళ ప్రకటించింది. బీసీసీఐ ప్రకటించిన జట్టు జాబితానుంచి పంత్ ను పక్కన పెట్టారు.గత సిరీస్‌ల్లో బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమవుతుండటంతో అతనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దక్షిణాఫ్రికాతో జరుగనున్న తొలి టెస్టుకు పంత్‌ను తప్పిస్తారని గత వారామే సూచన ప్రాయంగా తెలిసినప్పటికీ ఇప్పుడ అధికారంగా అతన్ని పక్కన పెట్టేశారు. దక్షిణాఫ్రికాతో మొదటి టెస్టుకు పంత్‌ను తప్పించిన విషయాన్ని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్పష్టం చేసినట్లు ఐసీసీ ఒక ట్వీట్‌ ద్వారా పేర్కొంది.

తుది జట్టులో న్‌ వృద్ధిమాన్‌ సాహా, రవిచంద్ర అశ్విన్ స్థానం సంపాదించారు.గాయం నుంచి సీనియర్‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ వృద్ధిమాన్‌ సాహా పూర్తిగా కోలుకొని ఫిట్‌నెస్‌ సాధించడంతో పంత్‌ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. సాహా చివరిసారిగా 2018 జనవరిలో సౌతాఫ్రికా టూర్‌లో టెస్టు మ్యాచ్‌ ఆడాడు. కెరీర్‌లో ఇప్పటి వరకు 32 టెస్టులాడిన సాహా 30.63 సగటుతో 1164 పరుగులు చేశాడు.

ఎంఎస్‌ ధోనికి సరైన ప్రత్యామ్నాయం రిషభ్‌ పంత్‌ అని భావించినా అది కాస్తా మూన్నాళ్ల ముచ్చెటే అవుయినట్లు తెలుస్తోంది. వన్డేల్లో పంత్ కు పోటీగా సంజూ శాంసన్‌, టెస్ట్ ఫార్మాట్ లో సాహా నుంచి పంత్‌కు సవాల్‌ ఎదురవుతోంది.బ్యాటింగ్‌, కీపింగ్‌ల్లో పంత్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోవడం ఒకటైతే, కీపర్‌ స్థానంలో ఉన్న ఆటగాడు డీఆర్‌ఎస్‌ విషయంలో స్పష్టమైన అవగాహనతో ఉండాలి. ఇందులో కూడా పంత్‌ విఫలమవుతూ వస్తున్నాడు.

మరొకవైపు వికెట్ల వెనుక పంత్‌ కంటే సాహానే అత్యుత్తమం అని కోహ్లి, శాస్త్రిలు భావిస్తున్నారు. దాంతో పంత్‌ స్థానంలో సాహాను సఫారీలతో తొలి టెస్టు ఆడించడానికి రంగం సిద్ధం చేశారు. టెస్టు జట్టులో పంత్‌ ఉన్నప్పటికీ అతని స్థానంలో సాహా పేరును ఖారరు చేశారు. దాంతో సాహా తుది జట్టులో ఆడటం ఖాయం. మరి తొలి టెస్టులో సాహా రాణిస్తే పంత్‌ అవసరం ఈ సిరీస్‌లో ఉండకపోవచ్చు.

భారత జట్టు:

విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రహానె(వైస్‌ కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌, ఛెతేశ్వర్‌ పుజారా, హనుమ విహారి, అశ్విన్‌, రవీంద్ర జడేజా, వృద్ధిమాన్‌ సాహా, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -