Tuesday, May 14, 2024
- Advertisement -

రికీ పాంటింగ్ రికార్డును కోహ్లీ బ‌ద్దలు కొడ‌తాడా…?

- Advertisement -

ఇప్ప‌టికే ఎన్నో రికార్డులు సాధించిన వారాట్‌కోహ్లీ ముందు ఓ ఆస‌క్తిక‌ర‌మైన రికార్డు సిద్ధంగా ఉంది. ఇటీవల అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో రికీ పాంటింగ్‌ శతకాల రికార్డును బద్దలుకొట్టిన కోహ్లీ ఇప్పుడు మరోసారి పాంటింగ్‌కు మాత్రమే సాధ్యమైన ఘనతను అందుకోవడానికి చేరువయ్యాడు.

కెప్టెన్‌గా ‘నంబర్‌ వన్‌’ రికార్డును సొంతం చేసుకునేందుకు కోహ్లి స్వల్ప దూరంలో నిలిచాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌ తరువాత ప్రకటించిన బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో కోహ్లి టాప్‌-2 స్థానానికి ఎగబాకిన సంగ‌తి తెలిసిందే. ఒకేసారి నాలుగు స్థానాలను మెరుగుపరుచుకుని రెండో స్థానంలో నిలిచాడు. అయితే వన్డేల్లో, టీ 20ల్లో కోహ్లిదే అగ్రస్థాన కావడంతో టెస్టుల్లో కూడా నంబర్‌ వన్‌ స్థానాన్ని సాధిస్తే.. ఆసీస్‌ దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్‌ సరసన నిలుస్తాడు.

ఒకే సమయంలో మూడు ఫార్మాట్లలో నంబర్‌ వన్‌గా నిలిచిన ఏకైక కెప్టెన్‌ రికీ పాంటింగ్‌. 2005-06 సీజన్‌లో పాంటింగ్‌ ఈ ఫీట్‌ను సాధించాడు. కాకపోతే ఆటగాడిగా ఈ ఘనతను సాధించిన వారిలో ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ మాథ్యూ హేడెన్‌ మాత్రమే ఉన్నాడు. దాదాపు 11 ఏళ్ల కాలంలో ఒక కెప్టెన్‌గా ఆ రికార్డును సాధించే అవకాశం కోహ్లి ముందుంది.

విరాట్ నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని అందుకోవాలంటే త్వరలో దక్షిణాఫ్రికాతో ఆరంభమయ్యే టెస్టు సిరీస్‌లో కోహ్లి విశేషంగా రాణించాల్సి ఉంది. ప్రస్తుతం టెస్టుల్లో ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌(938పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, కోహ్లి(893 పాయింట్లు) రెండో స్ధానంలో ఉన్నాడు. ఇప్పుడు ఆసీస్‌ కూడా టెస్టు మ్యాచ్‌లు ఆడుతుండటంతో ఈ రికార్డును కోహ్లి అందుకోవడం అంత ఈజీ కాకపోవచ్చు. దక్షిణాఫ్రికా సిరీస్‌ ద్వారా కెప్టెన్‌ కోహ్లీ.. పాంటింగ్‌ అందుకున్న ఘనతను అందుకోవాలని ఆశిద్దాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -