Saturday, May 4, 2024
- Advertisement -

భారత్, పాక్ కుర్రోళ్ల మ్యాచ్ లో వెల్లువిరిసిన క్రీడాస్ఫూర్తికి ‘సాహో అంటున్న అభిమానులు..

- Advertisement -

ఇండియా వర్సెస్ పాకిస్థాన్… ఈ మాట వింటేనే ఆట ఏదైనా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అదే రెండు దేశాల మధ్యా క్రికెట్ మ్యాచ్ అయితే, ఇక భావోద్వేగాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టేడియం అభిమానుల‌తో కిక్కిరిసి పోతుంది. కోట్లాది మంది ప్ర‌జ‌లు టీవీల‌కు అతుక్కుపోతారు. అందుకే దాయాది దేశాల‌మ‌ధ్య మ్యాచ్ అంటే.

కప్పు కొట్టకున్నా చాలు భారత్ పై ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలని పాకిస్థాన్ అభిమానులు కోరుకుంటారు. సగటు భారత క్రికెట్ అభిమానికీ అదే కోరిక ఉంటుంది. ఇక న్యూజిలాండ్ లో అండర్ 19 క్రికెట్ పోటీలు జరుగుతున్న వేళ, క్రీడాకారుల మధ్య వెల్లివిరిసిన క్రీడాస్ఫూర్తికి ‘సాహో’ అనాల్సిందే. మైదానంలో పాక్ జట్టు ఆటగాళ్లకు మనోళ్లు సాయపడటం, మనోళ్లకు పాక్ ప్లేయర్స్ సహకరించడం చూసిన వాళ్లు జయాపజయాలు ఎలా ఉన్నా, ఇరు జట్ల యువకులనూ అభినందిస్తున్నారు. ఇది పెద్దోల్ల ఆట‌లో క‌నిపిస్తుందా.

కీలకమైన మ్యాచ్ లో వీరు ఎంతో పరిణతితో కూడిన క్రీడాస్ఫూర్తిని చూపించారని పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇరు దేశాల మెయిన్ టీములు క్రికెట్ ఆడే వేళ ఈ తరహా ఘటనలు కనిపిస్తాయని ఊహించలేమని అంటున్నారు. పాక్ ఆటగాడి షూ లేస్ ఊడిపోతే కట్టిన భారత ప్లేయర్, భారత ప్లేయర్ షూ సరిచేస్తున్న పాక్ క్రికెటర్, శుభమ్ గిల్ సెంచరీ చేసినప్పుడు పాక్ ఆటగాళ్లు వచ్చి అభినందిస్తున్న చిత్రాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. క్రీడాస్ఫూర్తి అంటే ఏందో జూనియ‌ర్ ఆట‌గాల్ల‌నుంచి నేర్చుకోవాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -