Wednesday, April 24, 2024
- Advertisement -

కెప్టెన్స్ మారడం మంచిదే : రోహిత్ శర్మ

- Advertisement -

ప్రస్తుతం టీమిండియా రోహిత్ శర్మ వరుస విజయాలతో దూసుకుపోతుంది. గత ఏడాది విరాట్ కోహ్లీ సారథ్యంలో దుబాయ్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో లీగ్ దశలోనే నిష్క్రమించిన టీమిండియా.. ఆతరువాత విరాట్ కోహ్లీ తన కెప్టెన్సీకి గుడ్ బై చెప్పడం.. ఆ వెంటనే రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం వెంటవెంటనే జరిగిపోయాయి. అంతకు ముందు కోహ్లీ కెప్టెన్సీలో పరిస్థితులను బట్టి వైఫల్యాలను ఎదుర్కొన్న టీమిండియా రోహిత్ సారథ్యంలో మాత్రం గొప్పగా రానిస్తోంది.

ఈ సక్సస్ వెనుక కారణాలను రోహిత్ శర్మ ఇటీవల ఓ ఇంటర్యూ లో తెలిపాడు. ” గత ప్రపంచ కప్ లో తాము ఎన్నుకొన్న నిర్ణయాలు సరైనవి కాదని ” అదే టీమిండియా ఓటమికి కారణమని రోహిత్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం టిమ్ స్వేచ్చగా ఆడడంతో పాటు స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు ముందుకు వెళుతోందని ” అదే సాధిస్తున్న విజయాలకు కారణమని చెపుకుచ్చాడు. ఇక ప్రస్తుతం టీమిండియా ఆడిన సిరీస్ లలో వరుసగా కెప్టెన్స్ మారుతున్న సంగతి తెలిసిందే.

శికర్ ధావన్, హర్డిక్ పాండ్య వంటి వారు ఇటీవల జరిగిన కొన్ని సిరీస్ లకు సారథ్య భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.. దీనిపై కూడా రోహిత్ స్పందిస్తూ.. జట్టులో ఎక్కువ మంది కెప్టెన్లు ఉండడం మంచిదేనని, అలా ఉండడం వల్ల పని ఒత్తిడి చాలా వరకు తగ్గుతుందని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఇక ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన టి20 సీరీస్ ను కైవసం చేసుకున్నా టీమిండియా ఆసియా కప్ టోర్నీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -