Wednesday, May 15, 2024
- Advertisement -

రెండో టెస్టులో చెత్త‌గా ఓడిన టీమిండియా..సిరీస్ కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికా…

- Advertisement -

విదేశీగడ్డపై టీమిండియాకు మరోసారి పరాభవం తప్పలేదుసెంచూరియన్‌లో జరుగుతోన్న భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టులో టీమిండియా 135 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్‌లో మురళీ విజయ్ 9, లోకేశ్ రాహుల్ 4, పుజారా 19, విరాట్ కోహ్లీ 5, పార్థివ్ పటేల్ 19, హార్దిక్ పాండ్యా 6, రవి చంద్రన్ అశ్విన్ 3, రోహిత్ శర్మ 47, షమీ 28, ఇషాంత్ శర్మ 4 (నాటౌట్), బుమ్రా 2 పరుగులు చేశారు. ఉన్నారు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎన్గిడీ 6 వికెట్లు తీయగా రబాడా 3 వికెట్లు తీశాడు. మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 335, రెండో ఇన్నింగ్స్‌లో 258 పరుగులు చేయగా, భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 307, రెండో ఇన్నింగ్స్‌లో 151 పరుగులు చేసింది.దీంతో మరో మ్యాచ్‌ మిగిలుండగానే 0-2తేడాతో సిరీస్‌ సఫారీల వశమైంది. తద్వారా వరుసగా 10వ సిరీస్‌ గెలిచి రికార్డు నెలకొల్పాలనుకున్న కోహ్లీ సేన కల కలగానే మిగిలిపోయింది.

నిప్పులు కక్కిన ఇన్‌గిడి : 35/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఐదోరోజు ఆట ప్రారంభించిన భారత్‌.. తొలి సెషన్‌లోనే చాపచుట్టేసింది. సౌతాఫ్రికన్‌ యంగ్‌ బౌలర్‌ ఇన్‌గిడి నిప్పులుకక్కేబంతులు విసిరి 5 వికెట్లు నేలకూల్చాడు. 11 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఐదోరోజు బరిలోకిదిగిన పుజారా.. మరో 8 పరుగులు మాత్రమే చేసి రనౌట్‌ అయ్యాడు. పార్థివ్‌ 19, హార్ధిక్‌ 6, అశ్విన్‌ 3 పరుగులుచేశారు. మరో ఎండ్‌లో వికెట్లు నేలరాలుతున్నా.. రోహిత్‌ శర్మ ఒక్కడే కాస్తోకూస్తో ఫర్వాలేదనిపించాడు. ఇరుజట్ల మధ్య మూడో టెస్ట్‌ మ్యాచ్‌ జొహన్నెస్‌బర్గ్‌ వేదికగా జనవరి 24 నుంచి జరుగనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -