Thursday, May 16, 2024
- Advertisement -

మాజీ కోచ్ గ్రేగ్ చాపెల్ కార‌ణంగా కెప్టెన్సీ,జ‌ట్టులో స్థానం కోల్పోవాల్సి వ‌చ్చింది గంగూలీ..

- Advertisement -

టీమిండియాను విజ‌యాల‌బాట‌లో న‌డిపించ‌న కెప్టెన్ల‌లో సౌర‌వ్ గంగూలీ ఒక‌రు. జ‌ట్టు కోచ్ చాపెల్‌, గంగూలి మ‌ధ్య ఉన్న విబేధాలు తెలిసిందే. తాజాగా గంగూలి తన ఆత్మకథ ‘ఎ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్’ పుసక్తంలో చాపెల్ వ‌ల్ల‌త‌న క్రికెట్ జీవితాన్ని ఎలా నాశ‌నం అయ్యింద‌నే వసంచ‌ల‌న విష‌యాల‌ను వెల్లడించాడు.

2005లో చాపెల్‌ తీరుతో గంగూలీ కెప్టెన్సీ వదులుకోవడమే కాకుండా.. జట్టులోనూ స్థానం కోల్పోయాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో అస్తవ్యస్త మార్పులు, డ్రెస్సింగ్ రూములో విభేదాలను పెంచడం ద్వారా టీమిండియాలో చాపెల్ చీలికలు తెచ్చాడు. మాజీ క్రికెటర్లతో పాటు స్వయంగా చాపెల్ తమ్ముడు ఇయాన్ చాపెల్ సైతం వద్దంటున్నా.. అతడ్ని తానే ఏరికోరి టీమిండియా కోచ్‌గా తెచ్చి చాలా పెద్ద పొరపాటు చేశానని గంగూలీ ఆ పుస్తకంలో ఆవేదన వ్యక్తం చేశాడు.

‘గ్రేగ్ చాపెల్‌‌తో నేను తొలిసారి మాట్లాడినప్పుడు.. అతనితో చాలా క్రికెట్‌ జ్ఞానం ఉందని భావించాను. ఆ విషయమే అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు దాల్మియాకి చెప్పగా.. అతను సున్నితంగా తిరస్కరిస్తూ వద్దన్నాడు. కానీ.. నేను దాల్మియాని ఒప్పించగలిగాను. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్, చాపెల్ తమ్ముడు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కానీ.. భారత జట్టుని నెం.1 స్థానంలో నిలిపే సామర్థ్యం అతనిలో ఉందని నేను నమ్మాను. అందుకే వారి ఆందోళలను నేను పట్టించుకోలేదు. కానీ.. నా క్రికెట్ కెరీర్‌ని చాపెల్ సర్వనాశనం చేశాడంటూ ఆత్మ‌క‌థ‌లో వెల్ల‌డించారు.

ముఖ్యంగా 2005లో నేను కెప్టెన్సీతో పాటు జట్టులో స్థానాన్ని సైతం కోల్పోవాల్సి వచ్చింది. అవి నా కెరీర్‌లో చాలా దుర్భరమైన రోజులు. నాతో పాటు సచిన్‌ తెందుల్కర్‌ కూడా చాపెల్ తీరుతో ఇబ్బందిపడ్డాడు. పుస్తకంలో ఈ విషయాలు రాస్తున్నప్పుడు చాపెల్ గుర్తొచ్చి నాకు పట్టలేనంత కోపం వచ్చింది. ఏరికోరి తెచ్చినందుకు అతను నాకే ఎసరుపెట్టడం ఏమాత్రం క్షమార్హం కాదు’ అని గంగూలీ ఆ పుస్తకంలో వెల్లడించాడు. ఇంకా ఈ గంగూలి ఆత్మ‌క‌థ‌లో ఇంకెన్ని విష‌యాలు వెల్ల‌డ‌వుతాయో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -