Saturday, May 18, 2024
- Advertisement -

మూడో వ‌న్డే గెలుపు కోసం నెట్‌లో ప్రాక్టీస్‌లో చేమ‌టోడుస్తున్న‌ టీమిండియా….

- Advertisement -

శ్రీలంకతో విశాఖపట్నం వేదికగా ఆదివారం జరగనున్న చివరి వన్డే కోసం భారత్ జట్టు సిద్ధమైంది. ధర్మశాల వన్డే ఘోర పరాభవం నుంచి వేగంగా కోలుకుని.. మొహాలిలో అద్భుత విజయం సాధించిన భారత్.. ఈ చివరి వన్డేలోనూ అదే జోరుని కొనసాగించి సిరీస్‌ చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్ప‌టికే ఇరు దేశాలు చెరోక మ్యాచ్ గెలిచి 1-1తో స‌మానంగా ఉన్నాయి. చివ‌రి వ‌న్డే గెలిచి సిరీస్‌ను కైవ‌సం చేసుకొనేందుకు టీమిండియా ముమ్మ‌రంగా క‌స‌ర‌త్తు చేస్తోంది.

టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఆధ్వర్యంలో శనివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో క్రికెటర్లు చెమటోడ్చారు. దినేశ్ కార్తీక్ ఎక్కువ సేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయగా.. ధోనీ, ఇతర యువ క్రికెటర్లు ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశారు. మొహాలి వన్డేలో డబుల్ సెంచరీ బాది సూపర్ ఫామ్‌లోకి వచ్చిన రోహిత్ శర్మ.. చివరి వన్డే‌కి జట్టులో మార్పులు లేకుండానే బరిలోకి దిగాల‌ని యోచిస్తున్నారు.

టీమిండియాకు విశాఖలో తిరుగులేని రికార్డు ఉంది. ఇప‍్పటివరకూ ఇక్కడ వన్డే మ్యాచ్‌లు జరగ్గా, అందులో భారత్‌ ఐదింట విజయం సాధించింది. మరొకమ్యాచ్‌లో ఓటమి పాలు కాగా, ఒక మ్యాచ్‌ రద్దయ్యింది. ఇక్కడ గతేడాది అక్టోబర్‌లోన్యూజిలాండ్‌తో చివరిసారి వన్డే మ్యాచ్‌లో తలపడిన టీమిండియా 190 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేయగా, న్యూజిలాండ్‌ 79 పరుగులకు ఆలౌటైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -