Thursday, May 16, 2024
- Advertisement -

ఇషాన్ కిషన్ డేంజరస్ ఓపెనర్ అవుతాడా ?

- Advertisement -

క్రికెట్ లో ఓపెనర్లది అత్యంత కీలక పాత్ర. ఓపెనర్లు ఎంత బాగా రాణిస్తే.. జట్టు విజయావకాశాలు అంతగా మెరుగుపడతాయి. అందుకే ఏ జట్టైనా కూడా ఓపెనింగ్ జోడీ పైన ప్రత్యేక ఫోకస్ పెడుతుంది. ఇక టీమిండియా విషయానికొస్తే.. ఓపెనింగ్ జోడీ అంటే మొదటగా అందరికీ గుర్తొచ్చేది సెహ్వాగ్, గంభీర్ లేదా సచిన్, సెహ్వాగ్. ఇంకా లేటెస్ట్ గా అంటే రోహిత్ శర్మ మరియు శిఖర్ ధావన్. అయితే ముఖ్యంగా బెస్ట్ ఓపెనర్ అంటే తడబడకుండా ఎవరైనా చెప్పే ఒకే పేరు వీరేంద్ర సెహ్వాగ్.. ఎందుకంటే టీమిండియా క్రికెట్ చరిత్రలో వీరేంద్రుడు సృష్టించిన సంచలనలు అన్నీ ఇన్ని కావు. మొదటి బంతి నుంచే ప్రత్యర్థులపై ఎదురు దాడి చేయడం ఒక సెహ్వాగ్ కే సొంతం.

బౌలర్ ఎవరైనా, జట్టు ఏదైనా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా బంతిని బౌండరీకి బాదడమే సెహ్వాగ్ లక్ష్యం. దాంతో క్రికెట్ చరిత్రలోనే అత్యంత డేంజరస్ ఓపెనర్ గా వీరేంద్ర సెహ్వాగ్ పేరు గాంచాడు. ఇక సెహ్వాగ్ తరువాత ఆ స్థానాన్ని ఇంతవరకు ఎవరు భర్తీ చేయలేదనే చెప్పాలి. సెహ్వాగ్ తరువాత హిట్ మ్యాన్ రోహిత్ రాణిస్తున్నప్పటికి సెహ్వాగ్ స్థాయిలో కాదనేది క్రికెట్ అభిమానుల నుంచి వినిపిస్తున్న మాట. అయితే టీమిండియా యువ సంచలనం ఇషాన్ కిషన్.. సెహ్వాగ్ స్థానాన్ని భర్తీ చేయగలడని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన చివరి వన్డే సిరీస్ లో ఇషాన్ డబుల్ సెంచరీతో వీర విహారం చేసిన సంగతి తెలిసిందే.

సిరీస్ ఓడిపోయినప్పటికి చివరి మ్యాచ్ తో ఇషాన్ సంచలనలే సృష్టించాడు. ఇప్పటివరకు 9 వన్డే ఇన్నింగ్స్ లు మాత్రమే ఆడిన ఇషాన్ తన మొదటి సెంచరీనే డబుల్ సెంచరీగా నమోదు చేయడం అరుదైన రికార్డ్ అనే చెప్పుకోవచ్చు. సచిన్ 431 ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ సాధించగా, సెహ్వాగ్ 234 ఇన్నింగ్స్ లు, రోహిత్ శర్మ 103 ఇన్నింగ్స్ లలో ఈ ఘనత సాధించారు. కానీ ఇషాన్ కిషన్ మాత్రం 9 ఇన్నింగ్స్ ల్లోని ఈ ఘనత సాధించిన మొదటి టీమిండియా ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. దాంతో ఇషాన్ ఇదే జోరు ను కొనసాగిస్తే.. రాబోయే రోజుల్లో దుర్భేద్యమైన ఓపెనర్ గా బలపడడం ఖాయం అని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -