Sunday, May 5, 2024
- Advertisement -

కీల‌క మ్యాచ్‌లో చేతులెత్తేసిన చెన్నై….ద‌ర్జాగా ఫైన‌ల్‌కు రోహిత్ సేన‌

- Advertisement -

ఐపీఎల్‌–12 లీగ్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్‌ అదే ఆటను ప్లే ఆఫ్స్‌లోనూ కొనసాగించింది. సమష్టి ఆటతో మరోసారి లీగ్‌లో ఫైనల్‌కు చేరింది. లీగ్ ద‌శ‌నుంచి వ‌రుస విజ‌యాల‌తో దూసుకెల్లిన చెన్నై కీల‌క మ్యాచ్‌లో బోల్తాప‌డింది. సొంత మైదానంలో ముంబై ఇండియన్స్ చేతిలో ఓటమి పాలైంది. ముంబై బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ అజేయ అర్ధ సెంచరీతో జట్టును ఫైనల్‌కు చేర్చాడు.తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ముంబై 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను చిత్తు చేసింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 131 పరుగుల స్వల్ప స్కోరు చేసింది. ఆదిలోనె కీల‌క‌మైన వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.మిడిలార్డర్ దారుణంగా విఫలమైంది. అంబటి రాయుడు చేసిన 42 పరుగులే అత్యధికం.అయితే రాయుడు, ధోని భాగస్వామ్యం జట్టుకు చెప్పుకోదగ్గ స్కోరు అందించింది. సీజన్‌లో కేవలం రెండో మ్యాచ్‌ ఆడిన మురళీ విజయ్‌ (26 బంతుల్లో 26; 3 ఫోర్లు) కూడా కొంత వరకు తన పాత్ర పోషించాడు. నెమ్మదైన పిచ్‌పై బ్యాటింగ్‌కు దిగిన చెన్నైని ప్రత్యర్థి స్పిన్నర్లు కట్టడి చేశారు.

అంబటి రాయుడు (37 బంతుల్లో 42 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), ధోని (29 బంతుల్లో 37 నాటౌట్‌; 3 సిక్సర్లు) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. రాహుల్‌ చహర్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ముంబై 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 132 పరుగులు చేసి గెలిచింది. సూర్యకుమార్‌ (54 బంతుల్లో 71 నాటౌట్‌; 10 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా, ఇషాన్‌ కిషన్‌ (31 బంతుల్లో 28; 1 ఫోర్, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. మూడో వికెట్‌కు వీరిద్దరు 63 బంతుల్లో జోడించిన 80 పరుగులే ముంబై విజయానికి బాటలు వేశాయి.

అనంతరం 132 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై మరో 9 బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(4), క్వింటన్ డికాక్ (8) నిరాశ పరిచినప్పటికీ ఫస్ట్ డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ పోరాడాడు. సూర్యకుమార్ కు తో ఇషాన్‌ కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.

37 బంతుల్లో సూర్యకుమార్‌ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎట్టకేలకు ఇషాన్‌ను బౌల్డ్‌ చేసి తాహిర్‌ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు.మొత్తం 54 బంతులు ఎదుర్కొన్న యాదవ్ పది ఫోర్లతో అజేయంగా 71 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 28 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా 13 పరుగులు చేశాడు. దీంతో మరో 9 బంతులు మిగిలి ఉండగానే ముంబై విజయ తీరాలకు చేరి ఫైనల్లో అడుగుపెట్టింది.ఐపీఎల్‌లో ముంబై ఫైనల్‌కు చేరడం ఇది ఐదోసారి. అద్భుతమైన ఆటతీరుతో జట్టుకు విజయాన్ని అందించిన సూర్యకుమార్ యాదవ్‌కు మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. రెండో క్వాలిఫైర్‌లో చెన్నై మ‌రోసారి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -