- Advertisement -

రాజ‌కీయాల్లో త‌న‌వైన ముద్ర వేసుకున్న దాస‌రినారాయ‌ణ‌రావు

- Advertisement -
Dasari Narayana Rao political career

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలగటమే కాదు.. టాలీవుడ్కు పెద్ద దిక్కుగా వ్యవహరించే దాసరి రాజకీయాల్లో త‌న‌దైన ముద్ర‌వేసుకున్నారు. ప్ర‌త్య‌క్షంగా రాజ‌కీయాల‌లో కీల‌క పాత్ర పోషించ‌డంతోపాటు …తానేంటో నిరూపించుకున్నాడు. రాజీవ్ గాంధీ హ‌యాంలో .. దాసరి కాంగ్రేసు పార్టీ తరఫున ఉత్సాహవంతముగా ఎన్నికల ప్రచారము సాగించాడు. రాజీవ్ హత్యానంతరం పార్టీకి కాస్త దూరంగా జరిగారు.

1990 దశకం చివరిలో ఆయన తెలుగు తల్లి అను ఒక రాజకీయ పార్టీని ప్రారంభించాడు. ఈ పార్టీకి కోస్తా ప్రాంతాలలోని కాపు వర్గాల నుండి మంచి స్పందన లభించింది. ఆ తర్వాత మాత్రం ఆయన కాంగ్రేస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నిక అయ్యాడు. బొగ్గు మరియు గనుల శాఖకు కేంద్రమంత్రిగా కూడా వ్యవహరించాడు. ఈయన కాంగ్రేస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సన్నిహితుడు. కాంగ్రేస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చాక క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నాడు.

{loadmodule mod_custom,Side Ad 1}

కాంగ్రెస్‌లో చేరడానికి ముందు దాస‌రి బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని దాసరి భావించారు. ఇందుకు పలువురు వామపక్ష మేధావులతో మంతనాలు జరిపారు. సీపీఎం నుంచి బయటకు వచ్చిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భీంరెడ్డి నరసింహారెడ్డితో కలసి సామాజిక ఉద్యమ వేదికను ఏర్పాటు చేశారు.
ఆ తర్వాత 1996లో తెలుగు తల్లి పార్టీని ఏర్పాటు చేద్దామనుకున్నా కార్యరూపం దాల్చలేదు. చివరికి కాంగ్రెస్‌ మద్దతుదారుగా మారి ఆ పార్టీకి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 1999లలో ఆ పార్టీలో చేరారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. 2000 ఏప్రిల్‌లో తొలిసారి రాజ్యసభ సభ్యుడయ్యారు. 2004 నుంచి 2008 వరకు కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. ఈ సమయంలో ఆయన కొన్ని ఆరోపణలను కూడా ఎదుర్కొన్నారు. 2012లో రాజ్యసభ సభ్యుడిగా పదవీ విరమణ చేశారు.

{loadmodule mod_custom,Side Ad 2}

సినిమా, రాజకీయాల్లో తనదంటూ ప్రత్యేకత చాటుకున్న దాసరి నారాయణరావు ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న కాపు ఉద్యమంలోనూ కీలకపాత్ర పోషించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించే లక్ష్యంతో అన్ని పార్టీ నేతలను ఒకతాటిపైకి తీసుకొచ్చారు. ముద్రగడ పద్మనాభాన్ని అరెస్ట్‌ చేసిన స‌మ‌యంలో ధీటుగా స్పందించారు. గతేడాది అక్టోబర్‌ 4 తన స్వగృహంలోనే కాపు నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. చివరికి కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్న తన చిరకాల కోరిక నెరవేరకుండానే ఆయన కన్నుమూశారు.

{loadmodule mod_sp_social,Follow Us}

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -