Sunday, May 19, 2024
- Advertisement -

రాజకీయాల్లో కొత్త పరిణామం.. వైసీపీలోకి మాజీ మంత్రి

- Advertisement -
East Andhra Ex Minister Join Ysrcp

ఏపీలో రాజకీయాలు ఎప్పుడు ఎటువైపు తిరుగుతాయో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. గత ఎన్నికల టైంలో ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున మొత్తం 67 మంది ఎమ్మెల్యేలు గెలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశ చూపి.. 21 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో తీర్ధం పుచ్చుకొన్నారు. అధికార పార్టీలోకి వలసల జరిగిన ఆ తర్వాత వైసీపీలోకి వలసలు మొదలు అయ్యాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ పాముల రాజేశ్వరి వైసీపీ పార్టీ తీర్ధం పుచ్చుకొన్నారు.

ఈ క్రమంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ వైజాగ్ జిల్లా అధ్యక్షుడు పసుపులేటి బాలరాజు వైసీపీ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు అని సమాచారం. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన మాజీ మంత్రి బాలరాజు కూడా తన రాజకీయ భవిష్యత్తును చక్కదిద్దుకునే పనిలో పడ్డారని, ఇందులో భాగంగా కాంగ్రెస్‌లో ఉండడం కంటే పార్టీ మారడమే మేలనే భావనకు వచ్చారని ఆయన అనుచరవర్గం చెబుతున్నారు. వైసీపీ పార్టీలో కంటే ముందుగానే తెలుగుదేశం పార్టీలో చేరాలని ఈ మాజీ మంత్రి బాలరాజు ముందుగా అనుకున్నప్పటికీ వైసీపీలో చేరడమే మంచిదనే అభిప్రాయంలో బాలరాజు ఉన్నట్టు తెలుస్తోంది.ప్రస్తుత పరిస్థితులో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు కనుమరుగయ్యే పరిస్థితి రావడంతో ఇప్పటికే అనేక మంది ముఖ్య నేతలు రాష్ట్రంలో ఇతర పార్టీల్లో చేరిపోతున్నారు.

ఇప్పటికే వైసీపీ పార్టీ అధినేత జగన్ బాలరాజు కలిసి పార్టీలో చేరే విషయంపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన వైసీపీ నేతలతో కూడా జగన్ చర్చలు జరిపినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లోని గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన బాలరాజు 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘోర ఓటమిని చవిచూసారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రస్తుత పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అఖండ విజయం సాధించగా, అప్పటికే మంత్రిగా ఉన్న బాలరాజు మూడో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చిన విషయం తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికల్లో  వేరే చోట సీటు కన్ఫాం చేసినట్లు సమాచారం. ఇప్పటికే బాలరాజు వర్గం అంతా ఆయనపై ఒత్తిడి తెస్తున్నారట. దాంతో వచ్చే నెలల్లో బాలరాజు వైసీపీ లో చేరడం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

Related

  1. ఏపీ రాజకీయాలో మరో సంచలనం.. వైసీపీలోకి కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత
  2. కృష్ణ జిల్లాలో సంచలనం.. వైసీపీలోకి ముగ్గురు కీలక నాయకులు
  3. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం జ‌గ‌న్ వేసిన ప్లాన్ అదిరింది
  4. చంద్రబాబుకు షాక్ఇచ్చిన కడప జిల్లా వైసీపీ ఎమ్మెల్యే.. 2019లో విజయం ఖాయం..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -