Saturday, May 18, 2024
- Advertisement -

టీడీపీకి మరో షాక్.. అనంతలో వైసీపీకి 2019లో విజయం ఖాయం..

- Advertisement -
2019 Elactions Won Ysrcp In Anathapuram

అనంత పురం జిల్లాలో టీడీపీ  హ‌వాత‌గ్గిపోతోందా!  నీటి క‌రువును  తీర్చ‌డంతో ప్ర‌భుత్వం విఫ‌ల‌మా? ప‌రిస్థిత‌లు వైసీపీకీ అనుకూలంగా మారుతున్నాయా! 2019 ఎన్నిక‌ల్లో  టీడీపీ అనంత‌ ప్ర‌జ‌ల ఆగ్ర‌హానికి గురికాక త‌ప్ప‌దా.. అగ్నికి ఆజ్యం పోసిన‌ట్లు ప్ర‌తిపానికి ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు ప‌లికారు… ప‌రిస్తితులు చూస్తుంటే అవున‌నే అంటున్నాయి.

అనంత‌పురం జిల్లా పేరు వింటేనే దేశంలో క‌రువు జిల్లాగా ముద్ర‌ప‌డిన జిల్లా. ఈ జిల్లాలోని హిందూపురం నియేజ‌క వ‌ర్గం టీడీపీకీ కంచుకోట‌.నంద‌మూరి తార‌క‌రామారావునుంచి… నేటి బాల‌కృష్ణ‌వ‌ర‌కు ప్ర‌జ‌లు అక్కున చేర్చుకున్నారు. ఇక ఆ ఇలకాలో ఇప్ప‌టివ‌ర‌కు ఏపార్టీకీ చోటులేదు. ప్ర‌భుత్వాలు మారినా… నాయ‌కులు మారినా ఆ నియేజ‌క వ‌ర్గ ప్ర‌జ‌ల‌ రాతులు మార‌లేదు. అనాదిగా ఉన్న నీటి ఎద్ద‌డిని తీర్చ‌డంలో ప్ర‌భుత్వాలు విఫ‌ల‌మ‌వుతూనే ఉన్నాయి. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డి ప్ర‌జ‌ల దాహార్తి తీర‌లేదు. అస‌లే క‌రువు కోర‌ల్లో చిక్కుకున్న ప్రాంతం కావ‌డంతో ల‌క్ష‌లు వెచ్చించి బోర్లు వేసినా చుక్క‌నీరు ప‌డ‌ని ప‌రిస్థితి. ఎండిపోయిన బోర్ల‌ను చూసి ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హావేశాలు పెల్లు బిక్కుతున్నాయి. అగ్నికి ఆజ్యం పోసిన‌ట్లు  ప్ర‌తిప‌క్షాలు ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు మ‌ద్ద‌తు తెలిపాయి. ఇంకే ముంది నీటి పోరు మొద‌లైన‌ట్లే. 

ప్ర‌స్తుతం హిందూపురం నియేజ‌క వ‌ర్గంనుంచి టీడీపీ నుంచి బాల‌కృష్ణ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. నీటి స‌మ‌స్య‌ను ప‌రిస్క‌రిస్తారీన పెట్టుకున్న ప్ర‌జ‌ల ఆశ‌లు అడియాశ‌ల‌య్యాయి. గుడ్డివాడు గూట్లో రాయి వేసిన‌ట్లు అప్ప‌డ‌ప్పుడు అలా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చి వెల్తున్న బాల‌కృష్ణ‌మీద ప్ర‌జ‌లు ఆగ్ర‌హంగా ఉన్నారు. త‌మ నేత‌పై అస్త్రాలు ఎక్కుపెట్టారు ప్ర‌జ‌లు. ఆయ‌న సినిమాలో మాత్ర‌మే  డైలాగులు చెప్ప‌డం త‌ప్పా… నిజ‌జీవితంలో మాత్రం జీరో అని అంటున్నారు. సినిమాలో ఆయ‌న వాడే డైలాగుల‌కు అనుగునంగా ప్ర‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు. స‌మ‌యంలేదు బాల‌య్యా…! నీటిస‌మ‌స్య ప‌రిస్కార‌మా?  ప‌లాయన‌మా..? డైలాగుల‌తో ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. ఏకంగా బాల‌కృష్ణ క‌నిపించ‌డంలేద‌ని దున్న‌పోతుల‌పై బాల‌య్య క‌నిపించ‌డంలేద‌ని ర్యాలీ తీశారు. వీరిక‌తోడు వైసీపీ నేత‌లు త‌మ పార్టీ జెండా రంగ‌ల గ‌ల బిందెల‌ను పంపినీ చేశారు.

జ‌గ‌న్‌కూడా వ్యూహాత్మ‌కంగానే వెల్తున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌కు మ‌ద్ద‌తు తెలిపి వారి ప‌క్షాన పోరాడాల‌ని శ్రేనుల‌కు పిలుపునిచ్చారు. ప్ర‌భుత్వంమీద ఉన్న వ్య‌తిరేక‌త‌ను త‌మ వైపుకు తిప్పుకోవాల‌ని నేత‌ల‌కు సూచించారు.ఇప్ప‌టికే ప్ర‌జ‌లు వైసీపీకీ బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఇదే వ్యూహంతో వైసీపీ ముందుకెల్తోంది. ఇక‌నైనా బాల‌కృష్ణ స్పందించి నీటి స‌మ‌స్య‌ను తీర్చ‌కపోతే  వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీకీ క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు.ఇక 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ కంచుకోట‌పై వైసీపీ జెండా  ఎగ‌ర‌డం ఖాయ‌మ‌నే సంవేతాలు అక్క‌డి ప్ర‌జ‌ల‌నుంచి వ‌స్తున్నాయి. 

Related

  1. కర్నూలు లో సంచలనం.. కలెక్టర్ కు చుక్కలు చూపించిన వైసీపీ మహిళ ఎమ్మెల్యే
  2. జ‌గ‌న్‌పై లోకేష్ పోటీచేస్తారు బుద్ధా వెంక‌న్న స‌వాల్‌
  3. చెత్త‌కుప్ప‌లా మారిన అంటార్కిటికా
  4. కార్ల‌పై ఎర్ర‌బుగ్గ‌ను వినియేగించ‌కుండా మార్గ‌ద‌ర్శ‌ కాలు జారీ చేసిన కేంద్రం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -