Friday, May 17, 2024
- Advertisement -

మోదీ బాబ‌ను దూరం పెడుతున్నారా…..?

- Advertisement -
Modi Shock to Babu

ఏపీలో భాజాపా-టీడీపీ బంధం తెగిపోనుందా..? బాబును దూరంగా పెట్టేందుకు మోదీ సిద్ధంగా ఉన్నాచంద్రబాబుకు, తెలుగు తమ్ముళ్ళకు చుక్కలు చూపిస్తున్న జగన్

రా..? రాష్ట్ర ప్ర‌మేయం లేకుండా కేంద్రం నిర్ణ‌యాలు తీసుకుంటోందా…? వ‌చ్చె ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌ను ద‌గ్గ‌రకు తీసుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తుందా..? చూస్తుంటే ప‌రిస్థితులు అలానే క‌నిపిస్తున్నాయి. రాను రాను కేంద్రంలో మార్పులు క‌నిపిస్తోంది.తాజాగా కేంద్రం తీసుకుంటున్నా నిర్ణ‌యాలు అందుకు బ‌లాన్నిచేకూరుస్తున్నాయి.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చిర‌కాల మిత్రులు భాజాపా,టీడీపీ మ‌ద్య బంధం తెగిపోయె సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.2014 ఎన్నిక‌ల్లో క‌ల‌సి పోటీచేసి రాష్ట్రంలోనూ,కేంద్రంలోనూ అధికార‌న్ని పంచుకుంటున్నాయి. మొద‌ట్లో ఉన్న స‌క్య‌త ఇప్పుడు క‌నిపిండంలేదు.అవ‌కాశం దొరికి న‌ప్పుడ‌ల్లా మిత్ర‌ప‌క్షం భాజాపా నేత‌లు విమ‌ర్శ‌లు ఎక్కుపెడుతున్నారు. వ‌చ్చె ఎన్నిక‌ల్లో ఏపార్టీతో నైన పొత్తు పెట్టుకునే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని భాజాపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు గ‌తంలో ప్ర‌క‌టించారు. వీటికి తోడు భాజాపా సీనియ‌ర్‌నేత పురందేశ్వ‌రి కూడాపార్టీ పిరాయింపుల‌పై కేంద్రాన‌కి రాసిన లేఖ అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మ‌రో వైపు జ‌గ‌న్ బెయిల్ పిటీష‌న్ కొట్టివేత వెనుక భాజాపా హ‌స్తం ఉంద‌న్న వార్తులు వినిపిస్తున్నాయి.

ఇక ద‌క్షిణాది రాష్ట్రాలైన ఏపీ,తెలంగాణాలో ఓంట‌రిగా పోటీచేస్తామ‌ని ఇప్ప‌టికే భాజాపా ఛీప్ అమీత్‌షా ప్ర‌క‌టించారు. అదిశ‌గానే అడుగులు వేస్తున్నారు.ఇప్ప‌టినుంచె ఏపీలో పార్టీని బ‌లోపేతం చేయాల‌ని ప్ర‌ణాలిక‌లు రూపొందిస్తున్నారు.ఇవ‌న్నీ ఒక ఎత్తైతె ఇప్పుడు జ‌రుగ‌తున్న ప‌రినామాలు టీడీపీని క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి.వ‌చ్చె ఎన్నిక‌ల్లో బాబును దూరంగా పెట్టేందుకు మోదీ సిద్దంగా ఉన్న‌ర‌నే సంకేతాలు వెలువ‌డుతున్నాయి. తాజాగా గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యాన్ని అంత‌ర్జాతీయ విమాన‌శ్ర‌యంగా మోదీ ట్విట్ట‌ర్‌లో ప్ర‌క‌టించారు. అస‌లు రాష్ట్ర ప్ర‌భుత్వానికి తెలియ‌కుండా ప్ర‌క‌టించింద‌న్న వార్తులు వినిపిస్తున్నాయి. ఏపీకీ ఏదైనా ప్రాజెక్టును కేద్రం ప్ర‌క‌టిస్తె చంద్రబాబు సర్కార్ హ‌డావుడి అంతా ఇంతా కాదు. కానీ అలాంటి హంగులు ఆర్భాటాల‌ను ప్ర‌భుత్వం చేయ‌లేదు.

{loadmodule mod_custom,Side Ad 1}

స్థానిక నేతలు, కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు తూతూమంత్రంగా హడావిడి చేసి ఊరుకున్నారు. మామూలుగా అయితే, ఓ భారీ బహిరంగ సభను నిర్వహించి అటు వెంకయ్యనాయుడు, ఇటు చంద్రబాబు.. బీభత్సమైన డైలాగులతో ఆంధ్రప్రదేశ్‌ని ‘ఉద్ధరించేసిన వైనం’పై ఊకదంపుడు ప్రసంగాలు చేసేవారు.కాని అలాంటి ఎలాంటి చ‌ప్పుడులేకుండా ముగించారు.మ‌రో వైపు మిర్చిరైతులు క‌ష్టాల‌ను చూసి కేంద్రం రాష్ట్ర ప్ర‌బుత్వంతో సంప్ర‌దించ‌కుండా మ‌ధ్ద‌తు ధ‌ర‌ను ప్ర‌క‌టించ‌పింది. ఇక ప్ర‌తిప‌క్ష వైసీపీ అధినేత రెండు ర‌జ‌ల‌దీక్ష‌తో కేంద్రం మిర్చి రైతుల‌కు మ‌ద్ద‌తు ధ‌ర ప్ర‌క‌టించింద‌నే వార్తలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇవ న్నీ చూస్తె వ‌చ్చె ఎన్నిక‌ల్లో వైసీపీతో పొత్తు పెట్టుకొనే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.రాజ‌కీయాల‌లో శాశ్వ‌త శత్రువులు, శాశ్వ‌త మిత్రులు ఎవ‌రూ ఉండ‌రు.

ఇలాంటి విషయాల్లో ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం వుంటుంది. ఆ లెక్కన అశోక్‌ గజపతిరాజు ఈ వ్యవహారంపై స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం విశేషమే మరి. చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్లపై కేంద్రం నుంచి అక్షింతలు పడ్డాయా.? కారణాలు ఏంటి.? అన్న చర్చ ఇప్పుడు టీడీపీ వర్గాల్లోనే జోరుగా సాగుతోంది. గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా ఆహ్వానించదగ్గ విషయం. ఇంతటి ఘనకార్యానికి, కనీసపాటి హడావిడి చేయలేని దుస్థితిలో చంద్రబాబు సర్కార్‌ ఎందుకు నెట్టివేయబడిందన్నదే విప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

Related

  1. చంద్ర‌బాబు వ్యూహానికి… శిల్పా,భూమా వ‌ర్గాలు మ‌టాషేనా..!
  2. ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై….బాబు,లోకేష్ వేర్వేరు ప్ర‌క‌ట‌న‌లు.
  3. సొంత జిల్లాలో బాబు స‌మావేశానికి డుమ్మాకోట్టిన బొజ్జల,ఎంపీ శివప్రసాద్‌ 
  4. చంద్రబాబుకి లెటర్ రాసి.. ఆత్మ‌హ‌త్య చేసుకున్న నిరుద్యోగి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -