Monday, May 6, 2024
- Advertisement -

సొంత జిల్లాలో బాబు స‌మావేశానికి డుమ్మాకోట్టిన బొజ్జల,ఎంపీ శివప్రసాద్‌ 

- Advertisement -
Chittoor TDP senior leaders shock to Chandrababu Naidu

చంద్ర‌బాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో ఎదురుగాలి వీస్తోంది.  ఎక్డికెల్లినా అసంతృప్తిసెగ‌లు ఎదుర‌వుతున్నాయి.చిత్తూరులో బాబు ప‌ట్టుకోల్పోతున్నారా అన్న అనుమానాలు క‌లుగుతున్నాయి.

తాజాగా  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం చిత్తూరు జిల్లా నేతలతో సమావేశం అయ్యారు.  బాబుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న  మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎంపీ శివప్రసాద్‌ గైర్హాజరు అయ్యారు. కేబినెట్‌ నుంచి ఉద్వాసన పలకడంతో బొజ్జల అలకబూనగా, తమను పట్టించుకోవడం లేదంటూ ఎంపీ శివప్రసాద్‌ బాహాటంగానే ముఖ్యమంత్రిపై తన అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే బాబుకు సొంత‌జిల్లాలో ఎదురుగాలి వీస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.

అయితే  ముఖ్యమంత్రి సొంత జిల్లాలో  టీడీపీ నేతలు చాలామంది ఏడాదిగా అసంతృప్తితోనే ఉన్నారు. పార్టీ పరంగా సీనియర్లకు ఎదురవుతున్న వరుస అవమానాలపై పరస్పర చర్చ మొదలైంది. నిన్న మొన్నటి వరకూ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అనారోగ్యం పేరిట పార్టీ అధిష్టానం ఆయనను మంత్రి పదవి నుంచి పక్కన పెట్టడంతో మనస్తాపానికి గురైన బొజ్జల తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. బాబు న‌చ్చెజెప్ప‌డంతో  బొజ్జ‌ల కొంత వ‌ర‌కు వెన‌క్కుత‌గ్గారు.అమ‌యితే త‌న అసంతృప్తిని మాత్రం బ‌హిరంగంగానే ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

మంత్రి వ‌ర్గ పున‌ర్విభ‌జ‌న  అసంతృప్తిసెగ చ‌ల్లార‌క‌ముందే చిత్తూరు ఎంపీ శివ‌ప్ర‌సాద్ తెర‌మీదు వ‌చ్చారు. టీడీపీలో ద‌ళితుల‌కు జ‌రుగుతున్న అన్యాయాంపై బ‌హిరంగంగానే బాబుమీద విమ‌ర్శ‌లు గుప్పించారు.  టీడీపీ ప్రభుత్వంలో దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ఆయనపై సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఏకంగా టెలీకాన్ఫరెన్సు ఏర్పాటు చేసి మంత్రుల సమక్షంలో భగ్గుమన్న విషయం తెలిసిందే. అవ‌స‌ర‌మైతే శివప్ర‌సాద్‌పై త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని బాబు హెచ్చ‌రించారు.దీంతో శివ‌ప్ర‌సాద్ మాత్రం వెన‌క్కి ఏమాత్రం త‌గ్గ‌డంలేదు. అవ‌స‌ర‌మైతే వైసీపీలోకి వెల్లేందుకు సిద్దంగా ఉన్నారన్నారు.

ఇప్పుడు బాబుకు అసంతృప్తి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.ఎప్పుడూ లేనంత‌గా నాయ‌కులుంచి ఎప్పుడూ ఇలాంటి వ్య‌తిరేక‌త ఎద‌ర‌వ‌లేదు. మంత్రివ‌ర్గ విస్త‌ర‌న‌కాన్నుంచి బాబుకు వ్య‌తిరేక ప‌వ‌ణాలు వీస్తున్నాయి.మంత్రి ప‌ద‌వులు రాని వాల్లంతా తీవ్ర అసంతృప్తిని బ‌హిరంగంగానే వెల్ల‌గ‌క్కారు.ఇప్పుడు  చిత్తూరు జిల్లానేత‌ల‌తో బాబు స‌మావేశాన్ని నిర్వ‌హించారు.అయితే  వీరిద్దరూ సీఎం సమావేశానికి డుమ్మా కొట్టడం గమనార్హం. దీన్ని బ‌ట్టిచూస్తే  బాబుకు భ‌విష్య‌త్తులో మ‌రింత వ్య‌తిరేక‌త ఎదురుకాక‌త‌ప్ప‌ద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

  1. నంద్యాలలో అఖిలప్రియకు చుక్క‌లు చూపించిన శిల్పా బ్యాచ్‌..!
  2. పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ త‌ప్పుతోంది..ఇక ఉపేక్షించేదిలేద‌న్న బాబు
  3. జగన్ పై లోకేష్ మరో బ్లండర్ మిస్టేక్.. టీడీపీనేతలే నవ్వుతున్నారు
  4. బాబు, లోకేష్ లు మైండ్ బ్లాక్ అయ్యే వార్నింగ్ ఇచ్చిన వైసీపీ మహిళా నేత

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -