- Advertisement -

అమ్మ కోలుకుంది… అన్నాడీఎంకె శ్రేణుల్లో ఆనందం!

- Advertisement -
jayalalithaa talking responding to treatment say apollo doctors

అన్నా‌డీఎంకె అభిమానులకు మంచి న్యూస్. తమిళనాడు సిఎం జయలలిత బాగానే మెరుగుపడినట్టు తమిళనాడు వర్గాలు చెబుతున్నాయి. ఎక్కువ సేపు ఆమె స్పృహలో ఉంటున్నారని.. కూర్చోగలుగుతున్నారని అంటున్నారు. ఐతే వెంటిలేటర్‌ సదుపాయాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. దాదాపు 10 రోజుల తర్వాత జయలలిత ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్‌ను రిలీజ్ చేసింది అపోలో ఆసుపత్రి. జయలలిత నెమ్మదిగా కోలుకుంటున్నారని.. కొన్నిరోజులు ఆసుపత్రిలోనే ఉండాలని డాక్టర్లు తెలిపారు.

క్రిటికల్ కేర్ నిపుణులు, సీనియర్ కార్డియాలజిస్టులు, సీనియర్ రెస్పిరేటరీ ఫిజిషియన్లు వీళ్లంతా కలిసి జయలలితకు ట్రీట్‌మెంట్ అందిస్తున్నట్లు అపోలో వర్గాలు తెలిపాయి. అమ్మ అపోలో చేరినప్పటి నుంచి ఆమె కోసం తమిళనాడు వ్యాప్తంగా ఆలయాలలో అభిమానులు ప్రత్యేక పూజలు చేసిన విషయం తెల్సిందే! అమ్మ బానే ఉంది అనే విషయం తెలియగానే అన్నాడీఎంకె శ్రేణుల్లో ఒకటే ఆనందం.

ఇక మరోవైపు తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై రూమర్లు క్రియేట్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సామాజిక కార్యకర్త రామస్వామి.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని కోర్టును ఆయన కోరారు. ఇటు వదంతులు క్రియేట్ చేసిన వ్యక్తులను అరెస్టు చేయడం సమస్యకు సరైన పరిష్కారం కాకపోవచ్చని జాతీయ మానవ హక్కుల సంఘం ఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్తు అన్నారు. వీటిని అడ్డుకునేందుకు చాలా మార్గాలున్నాయని, ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని, దీనిపై సుప్రీంకోర్టు చాలా సార్లు మాట్లాడిందని గుర్తు చేశారు.

Related

  1. న్యూస్ పేపర్ వేస్తూ చదువుకుంటున్న అమ్మాయి!
  2. అమ్మకి ఏమైందో తెలిసింది ..
  3. అమ్మకానికి టీవీ 9
  4. ఫేస్ బుక్ వల్ల అమ్మానాన్నలపై కేసు పెట్టిన కూతురు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -