ఏపీ రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు రోజు రోజుకి తన విలువని దిగజార్చుకునే విధంగా పనులు చేస్తున్నారు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. రాజకీయంలో ఎంతో అనుభవం, పరిజ్ఞానం ఉన్నా ఆయన దానికి ఉపయోగించకుండా ముందుకు పోతుండడం రాజకీయ విశ్లేషకులకు సైతం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకప్పుడు ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను మట్టి కురిపించిన చంద్రబాబే నా ఇలా చేస్తుంది అని వారు కలవరపడుతున్నారట.. చంద్రబాబు మీద జగన్ కు కూడా అంతగా కోపం లేదని అంటున్నారు. ఎందుకంటే ఎంతలేదన్నా చంద్రబాబు తన తండ్రి కి స్నేహితుడు. ఒకప్పుడు ఇద్దరు కలిసి ఒకే పార్టీ లో పనిచేసిన సమయం.. అందుకే కొన్ని విషయాల్లో చంద్రబాబు విషయంలో జగన్ చూసి చూడనట్లు ఉంటారు..
కానీ దాన్ని అలుసుగా తీసుకుని చంద్రబాబు ఇంకా రెచ్చిపోవడం వైసీపీ కి అస్సలు నచ్చట్లేదట.. పెద్దవారనే గౌరవం ఇస్తున్న కొద్దీ రెచ్చిపోవడంతో ఎప్పుడు చంద్రబాబు కు మూడుతుందని జగన్ వద్దకు కంప్లైంట్స్ తీసుకుపోతున్నారట.. నిజానికి రాష్ట్రంలో ఎక్కడో ఒక సమస్య ఎదో ఒక రూపంలో ఉత్పన్నమవుతూనే ఉంటుంది. దానికి అన్ని సార్లు సీఎం గా చేసిన వ్యక్తి, దేశంలోనే ఎక్కువ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా చెప్పుకునే వ్యక్తి పొలోమని రావడం టీడీపీ నేతలకు సైతం నచ్చట్లేదట..
అన్నిటికీ తానై ముందు కు వచ్చి ఆ సమస్య ను తానే కనుగొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనని చెప్పుకోవడంపట్ల టీడీపీ నేతలు ఇక తాముండి ఏం లాభం అని ఫీల్ అవుతున్నారట.. ఏ ఊర్లో వీధులు శుభ్రం లేకపోయినా, ఎన్టీఆర్ విగ్రహం ఎక్కడా కూల్చివేయబడినా సరే చంద్రబాబు తన ఆయుధమైన ట్విట్టర్ లో వైసీపీ కి వ్యతిరేకంగా పిట్ట కూతలు కూయడం ప్రారంభిస్తారు.. అదే పని తన టీడీపీ నేతలతో చేయిస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే చంద్రబాబు.. చంద్రబాబు అని అన్ని సమస్యల్లో జగన్ కంటే ఎక్కువగా వేలు పెడుతూ ప్రజల నోళ్ళలో మెదులుతున్న చంద్రబాబు ప్రతి విషయంలో దూరకుండా తన నాయకులకే విమర్షింపచేస్తే ప్రజల్లో కొంతైనా టీడీపీ పై ఆసక్తి పుడుతుందని చెప్తున్నారు.. ఇంత చెప్పినా ఇదే పద్ధతి కొనసాగితే మాత్రం వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు పెద్ద మైనస్ అవుతాడని తప్పకుండా చెప్పొచ్చు..
