ముంబై: తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తాను చాలా అదృష్టవంతుడినని అన్నారు. తాను ఈ ఫొటోను తీసుకోలేకపోయినట్లైతే
మరింత అదృష్టవంతుడిని అయ్యేవాడ్ని కాదని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంతకీ ఏమయ్యిందంటే.. ముంబైలో జరిగిన ప్రత్యేకమైన గ్లోబల్ సిటీజన్ ఇండియా కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఇందులో పలువురు ప్రముఖులు వారు చేయబోతున్న లక్ష్యాల గురించి ప్రకటించారు. కీటీఆర్ కూడా తాను 2017 కల్లా 25 లక్షల కుంటుంబాలకు మంచినీరు అందించడం ద్వారా 96 లక్షల మందికి మేలు చేకూర్చలనే కృతనిశ్చయంతో ఉన్నట్టు ఈ కార్యక్రమంలో తెలిపారు.
అయితే ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడ ఉన్న క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ యాక్టర్ షారుక్ఖాన్లను కలిశారు కేటీఆర్. వారితో సెల్ఫీ కూడా దిగారు. అయితే వీరితో దిగిన ఫొటో తాను దాచుకుంటానని చెప్పారు. ఈ ఫొటో గనక తీసి ఉండకపోతే తాను మరింత అదృష్టవంతుడ్ని అయ్యేవాడ్ని కాదని అన్నారు కెటీఆర్. తనకు ఎంతో ఇష్టమైన ఈ లెజెండరీ వ్యక్తులతో తాను ఫొటో దిగడం లక్కీ అన్న కేటీఆర్ దాన్ని సోషల్ మీడియాలో పెట్టి తన సంతోషాన్ని అందరితో పంచుకున్నారు.
