Sunday, May 19, 2024
- Advertisement -

కరోనాతో ప్రముఖ చిత్రకారుడు కన్నుమూత

- Advertisement -

బాపు తర్వాత ఆ స్థాయి పేరు తెచ్చుకున్న చిత్రకారుడు చంద్ర కన్నమూశారు. భారతీయ చిత్ర కారుల్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు చంద్ర. వరంగల్‌కు చెందిన చంద్ర.. 1946, ఆగస్టు 28న జన్మించారు. వివిధ పత్రికల్లో కథలకు బొమ్మలు వేశారు… కొన్ని వేల కొద్ది తెలుగు పుస్తకాల కవర్‌ పేజీలు ఆయన చేతిలో రూపుదిద్దుకున్నాయి.

కథలు కూడా రాసిన చంద్ర.. బీ.నరసింగరావు తీసిన సినిమాల్లో నటించారు. గత మూడేళ్లుగా నరాలకు సంబంధించిన చికిత్స తీసుకుంటున్న చంద్రను కరోనా మహమ్మారి బలి తీసుకుంది. సికింద్రాబాద్‌లోని మదర్‌ థెరిసా రీహాబిటేషన్‌ సెంటర్‌లో కరోనాతో చికిత్స పొందుతూ ఆయన నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు.

చంద్ర పార్థివదేహాన్ని బంజారాహిల్స్‌ శ్రీనగర్‌ కాలనీలోని నివాసానికి తరలించారు. ఆయన మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

కరోనా ఎఫెక్ట్.. వెంకటేష్ ‘నారప్ప’ విడుదల వాయిదా

చెర్రీ సరసన మరోసారి బాలీవుడ్ బ్యూటీ!

రేపటి మినీ పోరుకు సర్వం సిద్దం…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -