చెర్రీ సరసన మరోసారి బాలీవుడ్ బ్యూటీ!

- Advertisement -

రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్‌‌‌లో సినిమా గురించి ప్రేక్షకలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో నటిస్తున్నాడు. అలాగే తన తండ్రి నటిస్తున్న ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్నాడు. అయితే శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నాడన్న వార్త బయటికి రాగానే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. శివాజీ, భారతీయుడు స్టైల్‌లో అవినీతిపై యుద్ధం చేసే పాత్రలో రామ్ చరణ్‌ని చూపించనున్నారట.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌ని కూడా ఫిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’లో చరణ్.. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నాడు. ఈ సినిమా 2022 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమాల తర్వాత చరణ్, శంకర్ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. శంకర్ మార్క్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరి తెలిసిందే. ఆయన సినిమాల్లో హీరోయిజం చాలా గొప్పగా ఉంటుంది.

- Advertisement -

అవినీతిపై పోరాడే గొప్ప యోధుడిగా చూపిస్తుంటారు. ఈ చిత్రంలో కూడా రామ్ చరణ్ అలాంటి పాత్రలోనే కనిపించబోతున్నాడట. ఇక చరణ్ సరసన హీరోయిన్‌గా కియారా అడ్వాణీని శంకర్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. శంకర్ చెప్పిన స్క్రీప్ట్ నచ్చడంతో కియారా ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో ‘వినయ విధేయ రామ’ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత కియారా మళ్లీ టాలీవుడ్ పైపు చూడలేదు.

సీఎం అశోక్ గెహ్లాట్ కు కరోనా పాజిటివ్..

షాక్.. కర్ణాటకలో 3వేల మంది కరోనా రోగులు అదృశ్యం

వామ్మో.. ది ఫ్యామిలీ మెన్ సమంత లుక్ ఏంటి ఇలా ఉంది!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -