Wednesday, April 24, 2024
- Advertisement -

రేపటి మినీ పోరుకు సర్వం సిద్దం…

- Advertisement -

తెలంగాణలో రేపు జరగబోయే మినీ పురపోరుకు పక్కగా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. ఓ వైపు కరోనా కేసులు పెరిగిపోతున్న తరుణంలో పూర్తి భద్రత చర్యలు తీసుకుంటున్నట్టు అధికారుల అంటున్నారు. మొన్నటి వరకు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్న వారు కరోనా భారి పడినట్టు తెలుస్తుంది. ఇప్పటికే సాగర్ ఉప ఎన్నికల్లో ఈ ఎఫెక్ట్ ఘోరంగా పడిందన్న విషయం తెలిసిందే.

ఈ కారణంతోనే రేపటి మినీ పోరుకు పూర్తిగా పకడ్భందీ చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం. రేపు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు జడ్చర్ల, కొత్తూరు, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్ మున్సిపాలిటీలకు పగడ్బంధీ ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.

కోవిడ్-19 నిబంధనలు పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. మహిళలు, పురుషులతో పాటు వికలాంగులు, సీనియర్ సిటిజన్లకు వేర్వేరుగా క్యూలైన్లు పెట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను ఆదేశించింది. మే 3న కార్పొరేషన్లు, పురపాలికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమంత డిజైనర్ విషెస్!

మీకు అర్థమవుతుందా అంటూ.. టాటూ సీక్రెట్స్ రివీల్ చేసిన రష్మిక!

వ్యాపారవేత్తతో అనుష్క పెళ్లి.. తనకంటే చిన్నవాడితో పట్టుపడడంతోనే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -