కరోనా ఎఫెక్ట్.. వెంకటేష్ ‘నారప్ప’ విడుదల వాయిదా

- Advertisement -

కోలీవుడ్ లో హీరో ధనుష్ నటించిన అసురన్ చిత్రాన్ని రిమేక్ గా విక్టరీ వెంకటేశ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘నారప్ప’. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటిస్తుంది. తమిళ్ లో సూపర్ హిట్ అయిన అసురన్ భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తీస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రాన్ని మే 14 న విడుదల చేయాలని అనుకున్నారు.. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలను వాయిదా వేసినట్టు నిర్మాత సురేశ్ బాబు అధికారికంగా ప్రకటించారు.

కరోనా పరిస్థితులు గట్టెక్కిన అనంతరం ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తామని సురేశ్ బాబు తెలిపారు. వి క్రియేషన్స్ కలైపులి ఎస్.థాను సమర్పణలో సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సురేశ్ బాబు నిర్మిస్తున్నారు. తమిళ సూపర్ హిట్ సినిమా ‘అసురన్’ సినిమాకి రీమేక్ గా ’నారప్ప‘ తెలుగులో తెరకెక్కింది.

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ‘లవ్ స్టోరి’, ‘టక్ జగదీష్’, ‘విరాట పర్వం, ‘ఆచార్య’ తదితర సినిమాల విడుదలను సైతం వాయిదా వేశారు. కరోనా పరిస్థితులు చక్కబడిన అనంతరం ఈ సినిమాలు విడుదల కానున్నాయి.

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -