- Advertisement -

మాయ‌మ‌యిన… పెట్రోల్ బంక్‌..

- Advertisement -
petrol pump vanishes just before police raid in lucknow

దేశంలో పెట్రోల్ బంకులు చేస్తున్న మోసాలు అన్నీ ఇన్నీ కావు. న‌కిలీ మిష‌న్లు, న‌కిలీ చిప్‌ల ద్వారా వాహ‌న దారుల జోబుల‌కు చిల్లులు పెడుతున్నారు. అధికారులు ఎన్ని సార్లు దాడులు జ‌రిపినా బంకుల య‌జ‌మానులు మాత్రం ష‌రామామూలే.బంకుల య‌జ‌మానుల లీల‌లు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.

వీట‌ని అడ్డుకొనేందుకు అధికారులు చ‌ర్య‌ల తీసుకుంటున్నా ప‌లితం మాత్రం శూన్యం. మోసాలు చేస్తున్న బంకుల‌పై అధికారులు దాడులు నిర్వ‌హిస్తున్నార‌ని విష‌యం తెలియ‌గానే అప్ప‌టి వ‌ర‌కు ఉన్న పెట్రోల్ బంకు మాయ‌మ‌య్యంది. బంకు మాయ‌మ‌వ‌డంఏంట‌ని ఆశ్చ‌ర్య‌పోతున్నారా…! మీరు విన్న‌ది నిజ‌మే…అది జ‌ర‌గింది ఉత్త‌ర ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నోల‌లో…
ల‌క్నోలో పెట్రోలు బంకులు యజమానులు అక్రమాలకు పాల్పడుతున్నారని అధికారులు వాల్ల‌మీద దాడులు ముమ్మ‌రం చేశారు.దాడి విషయాన్ని కొద్ది నిమిషాల ముందుగా తెలుసుకున్న బంక్ య‌జ‌మాని ప్ర‌బుద్దుడు .. ఏకంగా పెట్రోలు పోసే మిషన్‌నే తీసి దాచేశారు! అలా తన బంకునే ఆయన మాయం చేశారు. బంకు పునర్నిర్మాణంలో ఉందంటూ బోర్డు పెట్టి.. దాడి నుంచి తప్పించుకోవాలని చూశారు. అయితే తలదన్నేవాడుంటే తాడి తన్నేవాడు ఉంటాడన్నట్లు.. అతగాడి పప్పులు అధికారుల దగ్గర ఉడకలేదు. ఇలాంటి ‘పునర్నిర్మాణంలో ఉన్న’ పలు బంకులమీద కూడా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేస్తూనే ఉన్నారు. వాళ్లు దాచిపెట్టిన మిషన్లను బయటకు తీయించి మరీ వాటిని తనిఖీ చేశారు.
ఆయా మిషన్లలో న‌కిలీ చిప్‌లు పెట్టి వాహ‌న‌దారుల‌ను మోసం చేస్తున్నారు. వాటిని గుర్తించిన అధికార‌లు వెంటనే తొల‌గించారు. వినియోగదారులను మోసం చేయడానికి వీలుగా పెట్రోలు బంకుల్లో ఇలాంటి చిప్‌లు పెట్టి, పైకి తగినంత పోసినట్లు చూపిస్తూనే అందులో కోత పెడుతున్న విషయం తెలిసిందే. గత వారం రోజులుగా యూపీ పోలీసులు చేస్తున్న దాడుల్లో ఇలాంటివి దాదాపు వెయ్యి వరకు చిప్‌లు బయటపడ్డాయి. వీటి ద్వారా రోజుకు రూ. 15 లక్షల విలువైన పెట్రోలును బంకుల యాజమాన్యాలు చోరీ చేస్తున్నట్లు గుర్తించారు.
యూపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6వేల పెట్రోలు బంకులుంటే అన్నింటిమీదా దాడుల‌ను ముమ్మ‌రం చేశారు స్పెష‌ల్ టాస్క్‌ఫోర్స్ అధికారుల‌. ఇప్పటివరకు 9 పెట్రోలు బంకులను సీల్ చేసిన అధికారులు… 23 మందిని అరెస్టు చేశారు. వారిలో నలుగురు యజమానులు కూడా ఉన్నారని స్పెషల్ టాస్క్‌ఫోర్స్ అధికారులు చెప్పారు. ప్రతి లీటరుకు 100 మిల్లీలీటర్లు తక్కువగా పోస్తున్నారు.మ‌రి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి స్పెష‌ల్ టాస్క్ పోర్స్ దాడులు చేస్తే కొంతైనా ప‌లితం ఉంటుంది. ఆ దిశ‌గా ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకుంటే మంచిది.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

  1. ఖాతాదారుల‌కు ఎస్‌బీఐ భారీ షాక్‌…
  2. భార‌త ఐటీ నిపుణుల‌కు ర‌ష్యాబంప‌ర్ ఆఫ‌ర్‌
  3. నోట్ల‌పై రాత‌లున్నా బ్యాంకులు తీసుకోవాల్సిందే….
  4. నిద్ర సరిగా లేకుంటే.. ఏమవుతుందో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -