Sunday, May 19, 2024
- Advertisement -

పవన్ను కాపులకు దూరం చేస్తున్నారా.. వైసీపీ ప్లానేంటి ?

- Advertisement -

ఏపీ లో ఉన్న బలమైన సామాజిక వర్గాలలో కాపు సామాజిక వర్గం ముందు వరుసలో ఉంటుంది. అందుకే ప్రధాన రాజకీయ పార్టీలు ఈ సామాజికవర్గాన్ని ఆకర్షించెందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఏపీ ఏ రాజకీయ పార్టీకైనా గెలుపోటములను డిసైడ్ చేయడంలో కాపు సామాజిక వర్గం ప్రధానమైనదని చెప్పవచ్చు. అందుకే వైసీపీ, టిడిపి, జనసేన పార్టీలు ఈ సామాజిక వర్గంపైనే ఎక్కువ ఫోకస్ చేస్తుంటాయి. జనసేన అధినేత కాపు సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో.. మొదటి నుంచి కూడా కాపులలో పవన్ పై సానుకూలత ఉంది. అయితే పూర్తి స్థాయిలో కాపులు పవన్ వెంటే ఉన్నారా అంటే చెప్పడం కష్టమే..

ఎందుకంటే కాపులు అధికంగా ఉన్న భీమవరం, గాజువాక వంటి ప్రాంతాలలో పవన్ ఓటమిపాలు అయిన సంగతి తెలిసిందే. దాంతో సొంత సామాజిక వర్గాన్ని ఆకర్శించేందుకు పవన్ ఇప్పుడు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఆ మద్య జరిగిన మంగలగిరి సమావేశంలో కూడా కాపుల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో పవన్ చేసిన వ్యాఖ్యలు పోలిటికల్ సర్కిల్స్ లో పెను ప్రకంపనలే సృష్టించాయి. ముఖ్యంగా పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఏ రేంజ్ లో ఫైర్ అయ్యారో అందరం చూశాం. ఇక తాజాగా మంత్రి కొట్టు సత్య నారాయణ పవన్ చేసిన వ్యాఖ్యాలపై తీవ్రంగా మండి పడ్డారు.

పవన్ వల్లే కాపులకు అన్యాయం జరుగుతోందని ఆయన ద్వజమెత్తారు. నిజంగా కాపులు పవన్ వెంట ఉంటే కాపులు అధికంగా ఉన్న రెండు చోట్ల ఎందుకు ఓడిపోయారని కొట్టు సత్య నారాయణ ప్రశ్నించారు. కాపు నేతలపై పవన్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ కాస్త సీరియస్ గానే తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ నెల 31 న వైసీపీ కాపు నేతలంతా భేటీ కానున్నారు. సమావేశంలో పవన్ చేసిన వ్యాఖ్యపై చర్చించనున్నట్లు మంత్రి కొట్టు సత్య నారాయణ చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి కాపుల విషయంలో పవన్ వైఖరి ఏంటనే దానిపై వైసీపీ చేస్తున్న ప్రయత్నం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

జగన్ కు బీసీలపై ప్రేమ ఎందుకు ?

కే‌సి‌ఆర్ మాస్టర్ ప్లాన్ కు.. ఎంతటి వారైనా చిక్కల్సిందే !

ఎన్నికల ఖర్చు : అక్కడ 2 లక్షలే.. ఇక్కడ 400 కోట్లు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -