- Advertisement -
వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి న్యూ లుక్ లో కనిపించాడు. గోదావరి పుష్కరాల్లో ఆయన పూర్తిగా భక్తుడి అవతారంలోకి మారిపోయారు. పట్టుపంచెలో.. నుదుటన బొట్టుతో జగన్ మోహన్ రెడ్డి పుష్కర స్నానం చేశాడు.
కొవ్వూరులోని పుష్కరఘాట్ లో జగన్ మోహన్ రెడ్డి స్నానమాచరించాడు. వేద పండితుల ఆశీర్వాదాలతో జగన్ పుష్కరస్నానం చేశాడు.
ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కి పిండ ప్రదానం చేశాడు. పితృదేవతలకు పిండప్రదానం చేయడం పుష్కరాల్లో ఆనవాయితీ. ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రికి పిండ ప్రదానం చేశాడు.
