టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్‌ని అక్టోబర్ 5 వరకు పొడగించింది ఏసీబీ కోర్టు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో తొలుత 14 రోజులు తర్వాత 2 రోజులు పొడగించిన న్యాయస్థానం తాజాగా మరో 11 రోజులు పొడగించింది. సీఐడీ అధికారులు రెండు రోజుల విచారణ అనంతరం చంద్రబాబును వర్చువల్‌గా న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు.
సీఐడీ అధికారులు విచారణ సందర్భంగా ఏమైన అసౌకర్యం జరిగిందా అని అడిగి తెలుసుకున్నారు. రేపు బెయిల్ పిటిషన్‌పై విచారిస్తామని బాబుతో చెప్పిన న్యాయమూర్తి ఇప్పుడే అంతా అయిపోలేదన్నారు. మీరు జ్యూడిషియల్ కస్టడీలోనే ఉన్నారని మరోసారి తేల్చిచెప్పారు న్యాయమూర్తి. అయితే విచారణలో ప్రాథమిక సమాచారం ఏదైనా గుర్తించారా అని జడ్జిని చంద్రబాబు అడగ్గా విచారణలో ఉన్న సమయంలో వివరాలు వెల్లడించడం సరికాదని సూచించారు.
ఇక ఈ సందర్భంగా చంద్రబాబు తరపు న్యాయవాదులపై అసహనం వ్యక్తం చేశారు న్యామూర్తి. ఒకటికి పది పిటిషన్లు దాఖలు చేయడం వల్ల విచారణ ఎలా జరుగుతుందని….కోర్టు సమయం వృధా అవుతుందని చెప్పారు.
మరోవైపు బాబు బెయిల్ పిటిషన్‌పై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టులో పదేపదే చంద్రబాబు బెయిల్ దాఖలు చేయగా దీనిని తిరస్కరించారు న్యాయమూర్తి. అయితే సీఐడీ అధికారులు బాబును మళ్లీ కస్టడీకి అప్పగించాలని కోరినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
