ప్రపంచకప్‌లో మరో సంచలనం నమోదైంది. ఇంగ్లాండ్‌కు ఆఫ్ఘానిస్తాన్ షాకిచ్చిన విషయం మర్చిపోకముందే దక్షిణాఫ్రికాపై సంచలన విజయాన్ని నమోదైంది నెదర్లాండ్. 246 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టును నిలువరించడంలో నెదర్లాండ్ సక్సెస్ అయింది. దీంతో 42.5 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌట్ కాగా 38 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. గత టీ20 ప్రపంచకప్‌లోనూ దక్షిణాఫ్రికాను ఓడించి సంచలనం సృష్టించిన నెదర్లాండ్ తాజాగా సేమ్ సీన్ రిపీట్ చేసింది.
డేవిడ్ మిల్లర్ (43), కేశవ్ మహారాజ్ (40) పోరాడగా మార్క్మ్ (1), డసెన్ (4), డికాక్ (20), బవుమా (16), క్లాసెన్ (28), జాన్సెన్ (9) విఫలమయ్యారు. నెదర్లాండ్స్ బౌలర్లలో వాన్ బీక్ 3, వాన్ డెర్ మెర్వ్, బాస్ డీ లీడ్, మీకిరన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
ఇక అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (78 నాటౌట్) ,వాన్ డెర్ మెర్వ్ (29), ఆర్యాన్ దత్ ( 23 ) రాణించడంతో గౌరవప్రదమైన స్కోరు చేసింది. వన్డే ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌కు ఇది మూడో విజయం.
