- Advertisement -

షాక్‌..సాయంత్రం కేసీఆర్ సభ…మాజీ ఎమ్మెల్యే రాజీనామా

- Advertisement -

సీఎం కేసీఆర్ ఎన్నికల వేళ టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నారు. అయితే ఓ వైపు వరుస సభలతో నియోజకవర్గాల్లో పర్యటిస్తుండగా మరోవైపు అసంతృప్త నేతలంతా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే కీలక నేతలు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడగా తాజాగా మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రూపంలో షాక్ తగిలింది.

తొలిసారిగా సీఎం కేసీఆర్ మేడ్చల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇవాళ సాయంత్రం మేడ్చల్‌లో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని మంత్రి,బీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డిని గెలిపించాలని కోరనున్నారు ఇక ఈ సభ కోసం భారీ ఏర్పాట్లు చేశారు మల్లారెడ్డి. కనివిని ఎరుగని విధంగా జనసమీకరణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కారు దిగి హస్తం గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది.

సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా సుధీర్ రెడ్డి పార్టీని వీడుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఇక సుధీర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించనున్నారు రేవంత్ రెడ్డి. వాస్తవానికి కొంతకాలంగా అసంతృప్తిలో ఉన్నారు సుధీర్. 2018 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సుధీర్ రెడ్డిని కాదని మల్లారెడ్డికి సీటు కేటాయించారు సీఎం కేసీఆర్.అప్పట్లోనే ఆయన పార్టీ వీడతారని ప్రచారం జరిగింది. కానీ కేటీఆర్ హామీతో పార్టీలోనే కొనసాగారు. ఇక తాజాగా సిట్టింగ్‌లకే మళ్లీ సీటు కేటాయించడంతో మరోసారి నిరాశే ఎదురైంది. దీంతో పార్టీని వీడేందుకు సిద్ధమవ్వగా అది సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా జరుగుతుండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -