Wednesday, May 15, 2024
- Advertisement -

స్టోక్స్‌..రీ ఎంట్రీకి ఇప్పుడు న్యాయం చేశాడు

- Advertisement -

రిటైర్ మెంట్‌ తర్వాత తిరిగి జట్టులోకి చేరాడు ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ స్టోక్స్. ఈ ఏడాది ప్రపంచకప్‌లో చెత్త ప్రదర్శనతో నిరాశ పర్చగా తన రీ ఎంట్రీకి ఆలస్యంగానైన న్యాయం చేశాడు స్టోక్స్. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసి ప్రపంచకప్‌లో తొలి సెంచరీ నమోదు చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 160 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇంగ్లాండ్ విధించిన 340 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్ 179 పరుగులకే కుప్పకూలింది. తేజ(41 నాటౌట్‌), కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌(38) రాణించగా మిగితా బ్యాట్స్‌మెన్ విఫలం అయ్యారు.అలీ(3/42), రషీద్‌(3/54),విల్లే రెండు వికెట్లు తీశారు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 50 ఓవర్లలో 339 పరుగులు చేసింది. బెన్‌ స్టోక్స్‌ 84 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 108 పరుగులు చేయగా మలాన్‌(87), క్రిస్‌ వోక్స్‌(51)హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారీ స్కోరు సాధించింది. స్టోక్స్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కగా టోర్నీలో రెండో గెలుపు నమోదు చేసింది ఇంగ్లాండ్. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో ప్రతీ జట్టు రెండేసి మ్యాచ్‌లు గెలువడం ఇదే తొలిసారి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -