- Advertisement -

తూర్పు గోదావరి..జనసేన సీట్ల సంఖ్య ఫైనల్‌!

- Advertisement -

టీడీపీ – జనసేన పొత్తులో ప్రధానంగా ప్రతిష్టంభన నెలకొన్న జిల్లాలు ఉభయ గోదావరి జిల్లాలు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తమకు ఎక్కువ సీట్లు కేటాయించాలని పవన్‌ ఫస్ట్ నుండి డిమాండ్ చేస్తున్నారు. అయితే టీడీపీ ఆశావాహుల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతో పొత్తు చర్చలు ఎప్పుడు పెండింగ్‌లోనే పడ్డాయి. అయితే జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించినా మెజార్టీ స్థానాలు ఈ జిల్లాల నుండే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే టీడీపీ వర్గాల నుండి అందుతున్న లీకుల ప్రకారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మొత్తం 19 స్థానాల్లో ఎవరికెన్ని స్థానాలు, అభ్యర్థుల పేర్లు కూడా ఖరారైనట్లు సమాచారం.

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ టీడీపీ అభ్యర్థులను ప్రకటిస్తోంది. టీడీపీ-బీజేపీ పొత్తు విషయంలో క్లారిటీ ఇంకా రాలేదు. కానీ ఇప్పటికే పొత్తులో ఉన్న జనసేనతో కలిసి అభ్యర్థులను ప్రకటిస్తోంది. తుని నుండి యనమల రామకృష్ణుడి కుమార్తె దివ్య, ప్రత్తిపాడు – పరుపుల సత్య ప్రభ,పెద్దాపురం- నిమ్మకాయల చినరాజప్ప,
కొత్తపేట – బండారు సత్యానందరావు లేదా దాట్ల సుబ్బరాజు,అనపర్తి -నల్లమిల్లి రామకృష్ణ,మండపేట – వేగుళ్ల జోగేశ్వరరావు,జగ్గంపేట – జ్యోతుల నెహ్రు,రాజమండ్రి రూరల్ -గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైనల్ అయ్యారు.

ఇక రాజమండ్రి అర్బన్ నుండి ఆదిరెడ్డి భవాని పేరు ఖరారు కాగా ఇందుకు సంబంధించిన ప్రకటన రావాల్సి ఉంది. జనసేనకు రాజానగరం, రాజోలు, కాకినాడ రూరల్ ఖరారు కాగా మిగితా స్థానాలపై క్లారిటీ రావాల్సి ఉంది. పిఠాపురం, రామచంద్రాపురం,అమలాపురం, పి గన్నవరం,రంపచోడవరం, కాకినాడ అర్బన్ స్థానాలపై ఇంకా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -