ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల సమరం అప్పుడే మొదలైంది. ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉండగానే ప్రధాన పార్టీలు దూకుడు పెంచడంతో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. అయితే ప్రజల నాడిని గమనిస్తే ఈసారి టీడీపీకి ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. ఇక కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఈసారి ఘోరంగా ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇందులో భాగంగా అరకు ఎంపీ సీటు కూడా ఒకటి. గిరిజన ఓటర్లే ఎక్కువగా ఉండే అరకులో టీడీపీ ఇంతవరకు గెలుపు రుచి చూడలేదు. పాలకొండ నుంచి రంపచోడవరం విస్తరించిన ఈ నియోజకవర్గం చాలా పెద్దది. 2009లో ఈ నియోజకవర్గం ఏర్పాటుకాగా ఒకసారి కాంగ్రెస్, రెండుసార్లు వైసీపీ విజయం సాధించింది. 2014లో గుమ్మడి సంధ్యారాణి, 2019లో వైరిచర్ల కిశోర్‌చంద్రదేవ్ టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే తాజాగా కిషోర్‌చంద్రదేవ్ టీడీపీకి రాజీనామా చేయడంతో టీడీపీకి అభ్యర్థి లేకుండా పోయారు.
ఒకవేళ అభ్యర్థి దొరకని పక్షంలో మిత్రపక్షాలకు ఈ సీటును వదులుకునేందుకు టీడీపీ రెడీ అయిందనే టాక్ నడుస్తోంది. అయితే టీడీపీ నేతలు మాత్రం ఈసారి పోటీకి ఆసక్తి చూపిస్తుండగా టీడీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.
