వైసీపీ ఎన్నికల శంఖారావానికి డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 27 నుండి వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఇడుపులపాయ నుండి ఇచ్ఛాపురం వరకు బస్సు యాత్ర నిర్వహించనున్నారు. 20 రోజుల పాటు ఏకధాటిగా జగన్ బస్సు యాత్ర ఉండనుంది. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర జరగనుంది.
రాష్ట్రవ్యాప్తంగా జగన్ బస్సు యాత్ర జరిగే అవకాశం ఉంది. ఒకటి,రెండు రోజుల్లో మేనిఫెస్టోను విడుదల చేయనుంది. మేనిఫెస్టో విడుదల తర్వాత దానిని ప్రజల్లోకి తీసుకెళ్లుందుకు జగన్ బస్సుయాత్ర ఉపయోగపడనుంది.
గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలను నెరవేర్చింది వైసీపీ. ఈ నేపథ్యంలో ఈసారి రైతులు, కార్మికులు, మహిళలలు, వృద్ధులు, యువత, విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా మేనిఫెస్టో రూపకల్పన జరిగినట్లు ప్రచారం జరుగుతోందది. మొత్తంగా జగన్ బస్సుయాత్ర ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
