- Advertisement -

గడ్కరీతో అవినాష్ రెడ్డి భేటీ..రోడ్ల విస్తరణపై వినతి!

- Advertisement -

కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి నేడు ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. వైఎస్సార్ జిల్లాలో రోడ్ల మౌలిక సదుపాయాల మెరుగుదల, రహదారుల విస్తరణ మరియు నగర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక విజ్ఞప్తులతో కూడిన వినతిపత్రాన్ని కేంద్ర మంత్రికి సమర్పించారు.

ముద్దనూరు నుంచి కడప వరకు ఉన్న ప్రస్తుత రహదారిని 4 లైన్ల జాతీయ రహదారిగా విస్తరించి అభివృద్ధి చేయాలని కోరారు. కడప నగరంలోని ప్రధాన మార్గమైన ఇర్కాన్ సర్కిల్ నుంచి జేఎంజే సర్కిల్ వరకు ఉన్న రోడ్డును 4 లైన్లుగా మార్చాలని విజ్ఞప్తి చేశారు.

కడప నగర పాలక సంస్థ (కార్పొరేషన్) పరిధిలో ఉన్న ఇర్కాన్ సర్కిల్ నుంచి ఐటీఐ సర్కిల్ వరకు ప్రజా సౌకర్యార్థం ఫుట్‌పాత్‌ల ఏర్పాటు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ మరియు ఇంటర్‌లాకింగ్ పేవర్డ్ బ్లాక్స్‌తో పార్కింగ్ వసతులు కల్పించాలని ప్రతిపాదించారు.

ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అందించిన వినతులపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అత్యంత సానుకూలంగా స్పందించారు. వైఎస్సార్ జిల్లాలోని ఈ రహదారుల విస్తరణ మరియు మౌలిక సదుపాయాల కల్పన పనులకు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించి త్వరలోనే పనులు ప్రారంభమయ్యేలా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -