- Advertisement -

టీడీపీ భూబాగోతం.. అసైన్డ్ భూముల కబ్జా

- Advertisement -

మొన్నటి వరకు నంద్యాల పార్లమెంట్ ఇంఛార్జ్ గా ఉన్న టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి భూ కబ్జా కేసులో ఇరుక్కున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఐడీలో సైబర్‌‌క్రైమ్ ఎస్పీగా పనిచేస్తూ వాలంట­రీ రిటైర్మెంట్‌ తీసుకున్నారు. 2019లో టీడీపీ నుంచి నంద్యాల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మొన్నటి వరకు కూడా నంద్యాల పార్లమెంట్‌ ఇన్‌చార్జిగా కొనసాగారు. ఆయన హైదరాబాద్‌ బుద్వేల్‌లోని అసైన్డ్‌ భూములు కాజేసినట్టు సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది.

హైదారబాద్ శివారులోని బుద్వేల్‌లో అసైన్డ్ భూములు కాజేయడానికి మాండ్ర శివానందరెడ్డి కుట్ర చేసినట్టు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీపీఎస్) పోలీసులు గుర్తించారు. దీంతో ఆయనపై ఈనెల 2న కేసు నమోదు చేసి నంద్యాల జిల్లా అల్లూరు గ్రామంలో ఉన్న మాండ్రను అరెస్ట్ చేసేందుకు వెళ్లగా.. తప్పించుకుని పారిపోయారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బుద్వేల్ దగ్గర కొంతమంది ఎస్సీ కమ్యూనిటీకి అసైన్డ్ ల్యాండ్‌లను పంపిణీ చేసి పాస్ పుస్తకాలను కూడా జారీ చేశారు. వాటిని దక్కించుకునేందుక మాండ్ర శివానందరెడ్డి తనకు తెలిసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు టి.జె.ప్రకాష్, కోనేరు గాందీ, ఎస్‌.దశరథ రామారావులను రంగంలోకి నడిపారు. ఆ తర్వాత అసైన్డ్ పట్టాదారులకు నామమాత్రం చెల్లించి 26 ఎకరాల భూములను తన కంపెనీల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతోపాటు రాత్రికిరాత్రే అనుమతి జీవోలు తెప్పించుకున్నట్టు సీసీఎస్ పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒక మెమో ద్వారా అసైన్డు భూముల స్వభావాన్ని ఆయన మార్చారని తేలింది.

దీంతో సీసీఎస్ అధికారులు మాండ్ర శివానందరెడ్డిని అరెస్ట్ చేసేందుకు నంద్యాల జిల్లా అళ్లూరు వెళ్తే పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. మొత్తం మీద అసైన్డ్ భూములు కాజేసిన ఆయన తీరుపై అటు టీడీపీ నేతల్లోనూ, స్థానిక ప్రజల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -