- Advertisement -

అసెంబ్లీలో డ్రంక్ అండ్ డ్రైవ్‌!

- Advertisement -

తెలంగాణ అసెంబ్లీలో డ్రంక్ అండ్ డ్రైవ్ వ్యవహారం కలకలం రేపింది. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. అసెంబ్లీకి వచ్చే సభ్యులకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించాలని…కొంతమంది సోయి లేకుండా మాట్లాడుతున్నారని సంచలన కామెంట్ చేశారు.

మామ చాటు అల్లుడిగా రూ. పదివేల కోట్లు దోచుకున్న దొంగ హరీష్ రావు అని.. ఆ అవినీతిని మేము నిరూపిస్తామని కోమటిరెడ్డి సవాల్ విసిరారు. దీనికి ఘాటుగా స్పందించారు హరీశ్‌ రావు. సుద్దులు మాకు చెప్పడం కాదు వారి సహచర మంత్రికి కూడా చెప్పాలి.. వెంకట్ రెడ్డి కమీషన్ లిస్టు చదవమంటే నేను చదువుతాను అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. కొంతమంది సభ్యులు డ్రింక్ చేసి సభకు వస్తున్నారని, సభలోకి వచ్చి ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదని అన్నారు. అసెంబ్లీ బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టాలని హరీష్ రావు సూచించారు.

కమీషన్ల కోసం కాళేశ్వరం కట్టారు తప్ప.. రహదారులను పట్టించుకోలేదు అన్నారు కోమటిరెడ్డి. రహదారుల నిర్మాణంపై గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని…డీపీఆర్ లు ఇవ్వకుండా పనులు నిలిపేశారు అన్నారు. గతంలో గుంతల రోడ్ చూపిస్తే కేటీఆర్ రూ. వెయ్యి ఇస్తామన్నారు…పదేళ్లలో రాష్ట్రంలోని రోడ్లన్నీ గుంతలమయం చేశారు అని మండిపడ్డారు. రూ.700 కోట్లతో కేసీఆర్ ఫామ్ హౌస్ కు రోడ్లు వేసుకున్నారు…ఉప్పల్ ఫ్లై ఓవర్ నిర్మాణం చేపట్టి ఆరున్నరేళ్లు అయినా ఇప్పటికీ పూర్తి కాలేదు అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -