- Advertisement -

కేసీఆర్‌ను కలవడం రెండోసారి!

- Advertisement -

కేసీఆర్‌ను కలవడం ఇది మొదటిసారి కాదు.. రెండోసారి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఆస్పత్రిలో ఉన్నప్పుడు కూడా కలిశాను … నేను, కేసీఆర్ మాట్లాడుకున్న విషయాలు అక్కడే అడగండి అన్నారు.

అక్కడ అడగకుండా ఇక్కడ ఎందుకు అడుగుతున్నారు?… కేసీఆర్ సభ నుంచి వెంటనే ఎందుకు వెళ్లిపోయారో అది ఆయన్నే అడగాలి అని మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

ఇవాళ తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. మిగతా సభ్యుల అందరికంటే ముందుగానే వెళ్లి తన చైర్ లో కూర్చున్నారు ప్రతిపక్ష నేత కేసిఆర్. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ హాల్లోకి రాగానే కెసిఆర్ దగ్గరికి వెళ్లి కరచాలనం చేశారు రేవంత్ రెడ్డి.
సీఎం తర్వాత కేసీఆర్ దగ్గరికి వెళ్లి మంత్రుల కరచాలని కరచాలని చేశారు మంత్రులు, ఎమ్మెల్యేలు.

కేసీఆర్ ను కలిసిన వారిలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభత్వ విప్ లు బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -