- Advertisement -

రాజకీయాల్లో తిట్లపురాణానికి ఆధ్యుడు కేసీఆరే!

- Advertisement -

కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కేసీఆర్‌, హరీష్ రావు, కేటీఆర్‌లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, నీళ్లు, నిజాలపై బహిరంగంగా చర్చ చేద్దామని ఆయన సవాల్ విసిరారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో జరిగిన అవకతవకలు, అవినీతి అంశాలపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో సమాధానం చెబుతారని స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి కేసీఆర్‌ను 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారని గుర్తు చేసిన చామల, 2029 ఎన్నికల్లో కూడా మరోసారి ఓటమి తప్పదని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలే తుది తీర్పు చెప్పారని, ప్రజాస్వామ్యంలో గెలుపు–ఓటములను అంగీకరించాల్సిందేనన్నారు. ఓటమిని జీర్ణించుకోలేకనే కేసీఆర్ బయటికి వచ్చి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.

హరీష్ రావుపై కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. “దెయ్యాలు వేదాలు వల్లించినట్లు హరీష్ రావు మాట్లాడుతున్నారు” అంటూ ఎద్దేవా చేశారు. నీతులు ఇతరులకు మాత్రమే అన్నట్టుగా హరీష్ రావు వ్యవహరిస్తున్నారని, ముందు తన మామ కేసీఆర్ మాట్లాడిన తిట్ల పురాణాన్ని చూసుకోవాలని సూచించారు. ఉద్యమ కాలంలో కేసీఆర్ నోటికి వచ్చినట్లు మాట్లాడారని, బూతులు మాట్లాడే పేటెంట్ హక్కులు కేసీఆర్‌కే వచ్చాయన్నారు. అసలు రాజకీయాల్లో తిట్ల సంస్కృతిని మొదలుపెట్టిందే కేసీఆర్ అని ఆరోపించారు.

కేసీఆర్ రాజకీయంగా మాట్లాడితే రేవంత్ రెడ్డి కూడా రాజకీయాలే మాట్లాడతారని, తిట్లకు దిగితే అదే స్థాయిలో సమాధానం ఇస్తారని చామల స్పష్టం చేశారు. రెండేళ్ల తర్వాత బయటికి వచ్చి “తోలు తీస్తాం” అంటూ బెదిరింపులకు దిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదన్నారు.

కేటీఆర్‌పై కూడా విమర్శలు గుప్పించారు. చిన్న–పెద్ద తేడా లేకుండా మాట్లాడుతున్నారని, ఐటీ అయినా ఇరిగేషన్ అయినా తనకే అన్నీ తెలుసన్న అహంకారంతో ఉన్నారని వ్యాఖ్యానించారు. హరీష్ రావు నిజంగా నీతులు చెప్పాలనుకుంటే ముందుగా కేసీఆర్‌, కేటీఆర్‌లకు చెప్పాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి హితవు పలికారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -