జార్ఖండ్ ముక్తి మోర్చా (జెఎమ్మెం) వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి శిభు సోరెన్ మృతిపట్ల వైసీపీ చీఫ్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శిబూ సోరెన్ జీ మరణం దేశానికి తీరని లోటు అన్నారు.
ఆదివాసీల సంక్షేమం, న్యాయ పోరాటం కోసం ఆయన జీవితాంతం చేసిన కృషిని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాం. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను అని పేర్కొన్నారు.
శిభు సోరెన్ సోమవారం ఉదయం 81 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. గత నెలలో కిడ్నీ సమస్యల కారణంగా ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చేరారు. గుండెపోటు వచ్చిన తర్వాత గత ఒక నెలగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు.
భారత ఆదివాసీ రాజకీయాల్లో శిబూ సోరెన్ గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఝార్ఖండ్ రాష్ట్ర స్థాపన కోసం సాగిన ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. జెఎమ్మెం వ్యవస్థాపకుడిగా 8 సార్లు ఎంపీగా, మూడు సార్లు సీఎంగా పనిచేశారు. గురుజీగా పేరు గాంచిన సోరెన్..తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో విజయాలు, వివాదాలు వెంటాడినా ఆదివాసీ హక్కుల కోసం ఆయన పోరాటం మాత్రం ఎప్పటికీ ఆపలేదు.
