- Advertisement -

శ్రీచైతన్య హాస్టల్‌లో ర్యాగింగ్ భూతం..

- Advertisement -

ఏపీలోని శ్రీచైతన్య కాలేజీలో ర్యాగింగ్ భూతం పడగవిప్పింది. శ్రీచైతన్య హాస్టల్‌లో ఐరన్ బాక్స్ తో కాల్చి దుర్మార్గంగా వ్యవహరించారు సీనియర్లు. కోనసీమ జిల్లా రాజమండ్రి మోరంపూడి శ్రీ‌చైత‌న్య హాస్ట‌ల్‌లో ఈ ఘ‌ట‌న‌ చోటు చేసుకుంది.

ప‌దో తరగతి విద్యార్థి గుర్రం విన్సెంట్ ప్రసాద్ (16)పై సహచర విద్యార్థుల పైశాచికత్వం ప్రదర్శించారు. ఐరన్ బాక్స్ తో పొట్ట భాగం, చేతులపై విచక్షణారహితంగా వాతలు పెట్టారు.

బిడ్డను చూసేందుకు శ్రీచైతన్య‌ స్కూల్‌కు తల్లి వెళ్ల‌డంతో ఈ ఘటన బయటపడింది. అయితే దీనిపై యాజమాన్యం స్పందించలేదు. విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదరించిన ఘటనకు పాల్పడ్డారు విద్యార్థులు. ఘటనకు పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తల్లి లక్ష్ణ్మీకుమారి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -