- Advertisement -

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్

- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. రెండు రోజులు రేపు, ఎల్లుండి(సెప్టెంబర్ 6,7)తేదీల్లో శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల నుండి సోమవారం ఉదయం 3 గంటల వరకు అంటే.. 12గంటల పాటు శ్రీవారి ఆలయం మూసి ఉంచుతారు. ఆ సమయంలో దర్శనాలు ఉండవు.

ఆదివారం రాత్రి 9.50 గంటలకు ప్రారంభం చంద్రగ్రహణం ప్రారంభం కానుంది. సోమ‌వారం తెల్లవారుజామున 1.31 గంటల వరకు చంద్రగ్రహణం కొనసాగనుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆనవాయితీగా ఆలయం తలుపులు మూసివేయనున్నట్లు టీటీడీ తెలిపింది. సోమవారం ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో ఆలయ తలుపులు తెరిచి శుద్ధి చేయనున్నారు. అనంతరం పుణ్యహవచనం నిర్వహిస్తారు.

సోమవారం 8వ తేదీ ఉదయం 6 గంటల నుండి భక్తులను తిరిగి శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. చంద్రగ్రహణం కారణంగా ఆదివారం ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్స‌వం, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. గ్రహణం సమయంలో ఆహారం తీసుకోరాదని టీటీడీ అధికారులు సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -