నిన్న ఐశ్వర్యరాయ్..నేడు నాగార్జున కట్ చేస్తే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా తన పేరు, ఫోటోను వాడుతున్నారని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు హీరో నాగార్జున.
AI వీడియోలు, పెయిడ్ ప్రమోషన్లు, హాష్ ట్యాగ్ క్రియేట్ చేయడం ఆపాలని.. అలానే పోర్నోగ్రఫీ వెబ్‌సైట్స్, లింక్స్ క్రియేట్ చేస్తున్నారని ఢిల్లీ హైకోర్టులో నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు. నాగార్జున పేరు, ఫోటోలను వాడుతున్న 14 వెబ్‌సైట్స్ లింక్స్ ను తొలగించాలని కోర్టును కోరారు నాగార్జున తరపు లాయర్. నాగార్జున పర్సనాలిటీ రైట్స్ కాపాడుతామని తీర్పునిచ్చింది ఢిల్లీ హైకోర్టు.
ఐశ్వర్య రాయ్ తన ఫోటోలు, వీడియోల దుర్వినియోగంపై దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. కొంతమంది వ్యక్తులు తన అనుమతి లేకుండా తన ఫొటోలు, పేరును ఉపయోగించి వివిధ రకాల ప్రకటనలు, ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, ముఖ్యంగా కొన్ని ఫోటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నారని ఐశ్వర్య తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం ఐశ్వర్య వాదనలతో ఏకీభవించింది. ఐష్ అనుమతి లేకుండా ఆమె ఫొటోలు, పేరును వాణిజ్య, ప్రచార కార్యకలాపాలకు వాడటానికి వీలు లేదని స్పష్టం చేసింది.
