- Advertisement -
ఏపీకి సంబంధించిన వెదర్ అప్డేట్ను ఇచ్చింది వాతావరణ శాఖ. దక్షిణకోస్తాకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉందని అధికారులు వెల్లడించారు. ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతవరణ శాఖ.
కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీపై ఉపరితల ఆవర్తనాల ప్రభావం కొనసాగుతోందని… రాగల 24 గంటలపాటు చేపల వేటకు వెళ్ళరాదని సూచించింది.
ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి అనుకూల వాతావరణం ఉందని… మరో నాలుగు రోజులపాటు వర్షాలు పడతాయని తెలిపింది.
