బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొణె మరోసారి వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా ప్రబాస్ నటించిన “కల్కి 2898 AD” సీక్వెల్ నుంచి ఆమె తొలగింపే ఎక్కువగా చర్చకు కారణమైంది.
ఇప్పుడు తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు. మెటా AI కి తన స్వరాన్ని అందించిన తొలి భారతీయ సెలబ్రిటీగా చరిత్ర సృష్టించారు. ఆమె ప్రత్యేకమైన గళం ఇప్పుడు వాట్సాప్, రే-బ్యాన్ మెటా స్మార్ట్ గ్లాసెస్, ఇన్‌స్టాగ్రామ్ వంటి అనేక ప్లాట్‌ఫార్మ్‌లలో వినిపించనుంది.
మెటా AI కి గతంలో తమ స్వరాన్ని అందించిన ప్రముఖుల్లో జాన్ సీనా, జుడీ డెంచ్, అవ్క్వాఫీనా వంటి ప్రముఖులు ఉన్నారు. దీపికా స్వరం ప్రస్తుతం భారతదేశం, అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి ఎంపిక చేయబడిన దేశాల్లో అందుబాటులో ఉంది.
దీపికా ప్రస్తుతం అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రానికి షూటింగ్ చేస్తున్నారు.
