- Advertisement -

గుజరాత్ మంత్రిగా జడేజా భార్య

- Advertisement -

గుజారత్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగింది. గుజరాత్ రాష్ట్రంలో నిన్న సీఎం భూపేంద్ర మినహా మంత్రులంతా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ నూతన కేబినెట్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. 26 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు మంత్రి పదవి దక్కింది.

శుక్రవారం గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, భూపేంద్ర పటేల్ నేతృత్వంలోని కొత్త మంత్రివర్గానికి ప్రమాణ స్వీకారం చేయించారు. హర్ష్ సంగ్హవి గుజరాత్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

కొత్త మంత్రుల జాబితా

స్వరూప్‌జీ ఠాకోర్ – వావ్ నియోజకవర్గం నుంచి ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గులాబ్‌సింగ్ రాజ్‌పుత్‌పై 2,395 ఓట్ల తేడాతో గెలిచి మంత్రి అయ్యారు.

పూనంఛంద్ బరాండా – భిలోడా నియోజకవర్గం నుంచి 28,768 ఓట్ల తేడాతో ఆప్ అభ్యర్థిని ఓడించి గెలిచారు.

సంజయ్‌సింగ్ మహీదా – మహుధా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రజిత్‌సింగ్ పర్మార్‌పై 25,689 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

కమ్లేష్ పటేల్ – పెట్లాడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ప్రకాష్ పర్మార్‌ను 17,954 ఓట్ల తేడాతో ఓడించారు.

రివాబా జడేజా – జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థి కర్షన్‌భాయ్ కర్ముర్‌పై 53,570 ఓట్ల తేడాతో గెలిచారు. ఆమె క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య.

జయరామ్ గామిట్ – అంజార్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రమేష్‌భాయ్ డాంగర్‌పై 37,709 ఓట్ల తేడాతో గెలిచారు.

ప్రవీణ్ మాలీ – దీసా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్‌కుమార్ రబారి‌పై 42,647 ఓట్ల తేడాతో విజయం.

కౌశిక్ వేకారియా – అమ్రేలీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పరీష్ ధనానీపై 46,657 ఓట్ల తేడాతో గెలిచారు.

దర్షనా వాఘేలా – ఆసర్వా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి విపుల్ పర్మార్‌పై 54,173 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

రమేష్ కటారా – ఫతేపుర నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థి గోవింద్ పర్మార్‌పై 19,531 ఓట్ల తేడాతో గెలిచారు.

కాంతిలాల్ అమృతియా – మోర్భీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి జయంతిలాల్ పటేల్‌పై 62,079 ఓట్ల తేడాతో విజయం.

ప్రఫుల్‌భాయ్ పాంశేరియా – కమ్రేజ్ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థి రామ్ ధడుక్‌పై 74,697 ఓట్ల తేడాతో గెలిచారు.

మనిషా వకీల్ – వడోదర సిటీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గుణవంత్రాయ్ పర్మార్‌పై 98,597 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

ఇశ్వర్‌సింగ్ పటేల్ – అంక్లేశ్వర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి విజయ్‌సింగ్ పటేల్‌పై 40,441 ఓట్ల తేడాతో గెలిచారు.

రమణ్‌భాయ్ సోలంకీ – బోర్సాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రాజేంద్ర‌సింగ్ పర్మార్‌పై 11,165 ఓట్ల తేడాతో గెలిచారు.

ప్రద్యుమన్ వాజా – కొడినార్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్ మక్వానాపై 19,386 ఓట్ల తేడాతో గెలిచారు.

అర్జున్ మోధ్వాడియా – మొదట కాంగ్రెస్ అభ్యర్థిగా పోరబందర్ నుంచి గెలిచి, తర్వాత బీజేపీలో చేరి ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఓదేడేరా రాజు భీమాపై 1,16,808 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

నరేశ్ మగన్‌భాయ్ పటేల్ – గందేవి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ పటేల్‌పై 93,166 ఓట్ల తేడాతో గెలిచారు.

జితేంద్రభాయ్ సవ్జీభాయ్ వాఘాణీ (జీతూ వాఘాణీ) – భవనగర్ వెస్ట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కిషోర్సింగ్ గోహిల్‌పై 41,922 ఓట్ల తేడాతో విజయం.

హర్ష్ రమేష్ సంగ్హవి – మజూరా నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థి పీవీఎస్ శర్మపై 1,16,675 ఓట్ల తేడాతో గెలిచి గుజరాత్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

క్రికెటర్ రవీంద్ర జడేజా కూడా కార్యక్రమానికి హాజరయ్యారు, ఎందుకంటే ఆయన భార్య రివాబా జడేజా మంత్రి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -