డేటా సెంటర్ కి అవసరం అయిన నీళ్లు, విద్యుత్, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది అన్నారు మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్‌నాథ్.
రామాయపట్నం పోర్టు, బందరు పోర్టు, మూలపేట పోర్టు, భోగాపురం విమానాశ్రయం, అచ్యుతాపురం యోకోహామా టైర్ కంపెనీ, శ్రీసిటీ బ్లూస్టార్ కంపెనీ, TCL కంపెనీ ఇవన్నీ మా ప్రభుత్వ హయాంలో వచ్చాయి? అన్నారు. వాటి దగ్గర నిలబడి ఇవన్నీ మేము తెచ్చామని గర్వంగా చెప్పలగలను… నారా లోకేష్ మంత్రిగా ఏ సంస్థలు రాష్ట్రానికి తెచ్చాడు?.. ట్రోలింగ్ జాతి పిత లోకేష్ అని దుయ్యబట్టారు.
బల్క్ డ్రగ్ పార్క్ ను ఆ ప్రాంతవాసులు వ్యతిరేకిస్తున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతు పలుకుతోంది అన్నారు. మెజారిటీ ప్రజల అభిప్రాయానికి గౌరవం ఇస్తూ వారి అనుమతితో మాత్రమే భూసేకరణ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతోంది… ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా మా పార్టీది ప్రజాపక్షమే అన్నారు అమర్‌నాథ్.
