- Advertisement -

ఐసీసీ సమావేశానికి నఖ్వీ..కప్‌ ఇచ్చేనా?

- Advertisement -

ఐసీసీ సమావేశానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ హాజరయ్యారు. దుబాయ్‌లోని ICC ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఇటీవలి కాలంలో ICC సమావేశాలకు ఆయన దూరంగా ఉన్న నేపథ్యంలో, ఈసారి కూడా ఆయన వస్తారా లేదా అన్న సందేహం నెలకొన్నప్పటికీ, ఆయన ఇప్పుడు ICC బోర్డు సమావేశానికి హాజరయ్యారు.

జూలైలో సింగపూర్‌లో జరిగిన వార్షిక సదస్సు సహా గతంలో జరిగిన అనేక ICC సమావేశాలకు నక్వీ గైర్హాజరయ్యారు. దీంతో ఈసారి కూడా ఆయన రాకపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఏషియా కప్‌కు సంబంధించిన వివాదం చర్చకు రానుండటంతో ఆ అనుమానం మరింత బలపడింది.

భారత జట్టుకు గెలుపు సాధించినప్పటికీ, ఏషియా కప్ ట్రోఫీని అప్పగించకుండా తన వద్దే ఉంచుకున్నందుకు విమర్శలు ఎదుర్కొంటున్న నక్వీ, చివరికి శుక్రవారం మధ్యాహ్నం చివరి నిమిషంలో సమావేశానికి హాజరయ్యారు. ఈ అంశంపై చర్చ కొనసాగుతోందని తెలుస్తోంది. పాకిస్థాన్ ప్రభుత్వంలో మంత్రి హోదాలో ఉన్న నక్వీపై, ట్రోఫీని భారత్‌కు అందించకపోవడంపై అంతర్జాతీయ క్రికెట్ పరిపాలకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సమాచారం.

ఇక భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) ఇప్పటికే స్పష్టంచేసింది — “భారత జట్టుకు చెందాల్సిన ట్రోఫీని నిరాకరించడం పై మౌనంగా ఉండం” అని. ఈ సమావేశంలో దీనిపై తీవ్ర చర్చలు జరగనున్నాయి. శుక్రవారం సాయంత్రం నాటికి ఈ అంశంపై స్పష్టమైన నిర్ణయం లేదా పరిష్కారం వెలువడే అవకాశముంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -