- Advertisement -

ముంబై జట్టుకు రైనా సలహా!

- Advertisement -

ఐపీఎల్ 2026 సీజన్ వేలం వేదిక సిద్ధమవుతోంది. నవంబర్ 15న రిటెన్షన్ జాబితా ప్రకటించనున్న నేపథ్యంలో, అన్ని జట్లు తమ తుది బృందాలపై నిర్ణయం తీసుకునే దిశగా కసరత్తు చేస్తున్నాయి. రిటెన్షన్ ప్రకటనలకు ముందు, సురేశ్ రైనా స్టార్ స్పోర్ట్స్ కార్యక్రమంలో మాట్లాడుతూ ముంబై ఇండియన్స్‌కు పలు సూచనలు ఇచ్చారు.

ఐదుసార్లు టైటిల్ గెలిచిన ఈ ఛాంపియన్ జట్టు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్‌ను విడుదల చేయాలని రైనా సూచించారు. దీపక్ చాహర్ విషయానికి వస్తే, అది పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది – వాళ్లు ఇతర ఆప్షన్లు ఉన్నాయా అనే దానిపై. అతడిని ఉంచినా, విడుదల చేసినా పెద్ద తేడా లేదు కానీ, వేలంలో సరైన ఆటగాళ్లు దొరకకపోవచ్చు కాబట్టి, అతడిని ఉంచడం మంచిది.

ట్రెంట్ బౌల్ట్‌ను ఖచ్చితంగా ఉంచాలి.అతను ఒక టాప్ బౌలర్, ఎడమచేతి బౌలర్‌గా అతనికి ప్రత్యేకమైన ఆధిక్యం ఉంది అని రైనా అన్నారు. ఐపీఎల్‌లోని 10 ఫ్రాంచైజీలు నవంబర్ 15న తమ తుది జాబితాను ప్రకటించనున్నాయి. వేలం 2025 డిసెంబర్‌లో జరగనుంది.

విల్ జాక్స్ ..ఇప్పటివరకు విల్ జాక్స్ మొత్తం 21 మ్యాచ్‌లు ఆడాడు.అందులో 19 ఇన్నింగ్స్‌లలో 463 పరుగులు సాధించాడు, సగటు 27.23. అతని అత్యధిక స్కోరు 100 నాటౌట్. బౌలింగ్‌లో కూడా మంచి ప్రదర్శనతో 21 మ్యాచ్‌లలో 8 వికెట్లు తీశాడు. వేలంలో అతను విడుదల అయితే, ఇతర ఫ్రాంచైజీల నుంచి పెద్ద మొత్తంలో బిడ్‌లు వచ్చే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -