- Advertisement -

వైసీపీ ప్రజాపోరులో ఉద్రిక్తత

- Advertisement -

ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ గుంటూరులో చేపట్టిన ‘ప్రజా పోరు’ నిరసన కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ర్యాలీలో పాల్గొనేందుకు బయల్దేరిన మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది.

పోలీసులు ర్యాలీకి అనుమతి లేదంటూ కంకరగుంట ఫ్లైఓవర్ వద్ద అంబటి రాంబాబును అడ్డగించారు. దీనిపై అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు, పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సీఐ తీరుపై మండిపడిన అంబటి, పోలీసుల చర్యను దౌర్జన్యంగా అభివర్ణించారు.

స్వామి థియేటర్ వద్ద కూడా ర్యాలీగా వెళ్తున్న వైయస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలను పోలీసులు కక్షపూరితంగా అడ్డుకోవడంతో వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు మండిపడ్డాయి. ముఖ్యంగా, పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు అంబటి రాంబాబు గారికి వేలు చూపిస్తూ ఓవరాక్షన్ చేశారని వైయస్‌ఆర్‌సీపీ నేతలు ఆరోపించారు. పోలీసుల అడ్డగింతకు వ్యతిరేకంగా అంబటి రాంబాబు ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు నిరసనకు దిగి, పోలీసుల తీరుపై తిరగబడ్డారు. ఈ సంఘటన గుంటూరులో పొలిటికల్‌ హీట్‌ని పెంచగా ప్రజాస్వామ్యంగా నిరసన చేపట్టే హక్కు కూడా లేదా అని రాంబాబు మండిపడ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -